Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఘర్మయంత్రములు

ఆటో యంత్రము (Otto Engine) : ఈ యంత్రము 1876 సం.లో ఆటో (Otto) అను జర్మను ఇంజనీరుచే

చిత్రము - 155

పటము - 8

ఆటోయంత్రపు నాలుగు స్ట్రోకులు

మొట్టమొదట నిర్మింపబడెను. గాలి, పెట్రోలు ఆవిరి (Petrol Vapour) కలిసి స్తూపములో మండుటచే ఈ యంత్రము పనిచేయుచున్నది. ఈ యంత్రములోని స్తూపమునకు 3 వాల్వులు అమర్చబడి యుండును. మొదటిది వాయువును ప్రవేశపెట్టుటకును, రెండవది గాలిని ప్రవేశపెట్టుటకును, మూడవది స్తూపమును ఖాళీచేయుటకును (exhaust) ఉపయోగింపబడును.

ఆటో ఆవర్తమునందు నాలుగు ప్రక్రియలు (operations) కలవు. వీటిని స్ట్రోక్స్ (strokes) అని అందురు.

1. ఛార్జిచేయు స్ట్రోకు (Charging stroke) : ఈ ప్రక్రియయందు పిస్టను P ముందుకు పోవుటచే పెట్రోలు ఆవిరియు, గాలియొక్క మిశ్రమమును తగు పాళ్ళలో వాల్వులద్వారా స్తూపములోనికి ప్రవేశ పెట్టబడును. (పటము 8 (a))

2. సంకోచపు స్ట్రోకు (Compression stroke) : వాల్వులు మూయబడి పిస్టను వెనుకకు పోవుటచే పైన ప్రవేశ పెట్టబడిన మిశ్రమము అతాపకముగా (adiabatically) సంకోచింపబడును. ఈ కారణముచే మిశ్రమముయొక్క ఘనపరిమాణము ఆరంభములోని ఘనపరిమాణములో సుమారు 5 వ వంతు మాత్రమే ఉండును. మిశ్రమముయొక్క ఉష్ణోగ్రత 600°C వరకు పెరుగును. (పటము 8 (b)). సంకోచపు స్ట్రోకు అనంతరము మిశ్రమములో అనేక విస్ఫులింగములు (sparks) ప్రవేశ పెట్టబడును. దీనితో మిశ్రమముయొక్క ఉష్ణోగ్రత సుమారు 2000°C వరకు పెరిగి క్షణకాలము స్తూపములో వాయుపీడనము సుమారు 15 వాతావరణముల (atmospheres) వరకు పెరుగును.

3. పనిచేయు స్ట్రోకు (Working stroke) పటము 8(c) : స్తూపములో అధిక పీడనము ఉండుటచే పిస్టను అధిక బలముతో ముందునకు నెట్టబడును. స్తూపములోని వాయు మిశ్రమము అతాపకముగా (adiabatically) వ్యాకోచించి, ఆరంభ దశలోని ఘనపరిమాణమును పొందును. తత్కారణముగా వాయువుయొక్క ఉష్ణోగ్రత అధికముగా పడిపోవును.

4. ఖాళీచేయు స్ట్రోకు (Exhaust stroke) : మూడవ ప్రక్రియ అనంతరము స్తూపములోని వాయు మిశ్రమము 'పని' చేయు శక్తిని కోల్పోవును. అందుచే పిస్టను వెనుకకు పోవుటచే వాయు మిశ్రమము వాల్వులద్వారా బయటకు పంపబడును. (పటము 8 d). స్తూపము పూర్తిగా ఖాళీ అయినతరువాత మరల క్రొత్త వాయు మిశ్రమములోనికి పంపబడును.

ఆటో ఆవర్తముయొక్క సూచిక 7 వ పటములో చూపబడినది.

డీసెల్ యంత్రము (Diesel Engine) : డీసెల్ అను జర్మను ఇంజనీరు ఆటో యంత్ర సామర్థ్యమును ఎక్కువ

చిత్రము - 156

పటము - 9

ఆటో ఆవర్తపు సూచిక పటము

చేయవలెనను తలంపుతో ఒక కొత్తరకపు యంత్రమును కనిపెట్టెను. దానినే 'డీసెల్ యంత్రమ'ని పిలుచు చున్నారు. ఇందులో సంకోచపు ప్రక్రియ (Compression operation) పూర్తి యగునంతవరకు వాయువు

559