Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఘర్మయంత్రములు

సంగ్రహ ఆంధ్ర

షాఫ్ట్ G కి తగిలించబడిన చక్రములు గుండ్రముగా తిరుగుచు యంత్రము ముందునకు పోవునట్లు చేయును.

జేమ్స్ వాట్ తరువాత, ఆవిరి యంత్రములో అనేక ముఖ్యమైన మార్పులు చేయబడినవి. ఇనుప పట్టాలమీద రైలు పెట్టెలను నడుపుటకు ఉపయోగించు ఆవిరి యంత్రమును రిచర్డ్ ట్రెవిథిక్ (Richard Trevithick) అను నాతడు మొట్టమొదట నిర్మించెను. 1829 వ సం.లో జార్జి స్టీవెన్సన్ (George Stevenson). ఆతని కుమారుడు రాబర్ట్ స్టీవెన్సన్ (Robert Stevenson) లు మొదటి రైలును లివర్ పూలు, మాన్ చెస్టరులమధ్య నడపిరి. రాబర్టు ఫౌల్టన్ (Pobert Foulton) అనునాతడు 1812 వ సంవత్సరములో మొదటిసారిగా ఆవిరి యంత్రమును ఓడలు నడపుటకు ఉపయోగించెను.

ఉష్ణయంత్రముల సామర్థ్యము (Efficiency of Heat engines) : ఉష్ణయంత్రము, ఉష్ణశక్తిని యంత్రశక్తిగా మార్చునట్టి సాధనము. అందుచే ఉష్ణయంత్రముల సామర్థ్యమును (efficiency) ఉష్ణగతిశాస్త్రపు మొదటి నియమము ననుసరించి క్రింది సమీకరణముచే కనుగొన వచ్చును.

ఌ = w

ఇచ్చట,

ఌ - ఉష్ణయంత్రపు సామర్థ్యము.

w - యంత్రముచే చేయబడిన పని,

J - శక్త్యుష్ణతా తుల్యాంకము (Mechanical equivalent of heat).

Q - ఉష్ణతాశక్తి,

సాధారణముగా వాడుకలోని ఉష్ణయంత్రములు వాటి కీయబడిన ఉష్ణశక్తి నంతను నూటికి నూరుపాళ్ళు పూర్తిగా యంత్రశక్తిగా మార్చలేవు. వాటి సామర్థ్యము నూటికి 5 నుండి 55 వంతుల వరకు మాత్రమే ఉండును. యంత్రముల సామర్థ్యము ఇంత తక్కువగా నుండుట వాటి నిర్మాణ లోపమువలన కాదు. ఆదర్శప్రాయముగా ఊహింపబడిన యంత్రముల సామర్థ్యము కూడా నూటికి నూరుపాళ్ళు ఉండదని సాడీ కార్నో (Sadi Carnot) అను ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు 19వ శతాబ్ది మొదటి భాగములో నిరూపించెను.

సూచిక పటము (Indicator diagram): ఉష్ణ యంత్రము పనిచేయు విధానమును తెలిసికొనుటకు

చిత్రము - 152

పటము - 5

కార్నో

సూచిక పటము (ప.6) చాల సహాయపడును. ఒక పాత్రలో కొంత ఉష్ణోగ్రత, పీడనముల వద్ద కొంత ఘనపరిమాణము గల వాయువును తీసికొందము. ఆ వాయువు యొక్క స్థితి, దాని పీడనము ఘనపరిమాణములచే నిర్దుష్టముగా నిర్ణయింపబడుచున్నది. X-అక్షములపై ఘనపరిమాణమును, Y-అక్షముపై వాయుపీడనమును తీసికొని ఒక రేఖాపటము (graph) ను గీచినచో, వాయువు యొక్కస్థితిని A అను బిందువుచే సూచించవచ్చును. (6 వ పటమును చూడుడు.) వాయుపీడనము, ఘన పరిమాణము మారినచో, వాయువుయొక్క రెండవస్థితిని B అను బిందువుచే సూచింపవచ్చును. వాయువుస్థితి A నుండి B కి మారుచున్న కాలములో, దానిస్థితి AB అను రేఖపైనున్నబిందువులు తెలియజేయును. అనగా వాయువుయొక్క స్థితిలో కలిగిన ఈ మార్పుపటములో AB అను రేఖ సూచించును. ఇట్లు పీడనము - ఘనపరిమాణముల మధ్య గీయబడిన పటమును సూచికపటము (Indicator diagram) అని అందురు. పటములో AB ba యొక్క వైశాల్యము యంత్రముచే చేయబడిన “పని”ని తెలియ

556