Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంధిస్రుతములు (హార్నోనులు)

సంగ్రహ ఆంధ్ర

శక్తికి మూలకారణము థై రాక్సిన్ అనునదనికూడ కనుగొనబడినది. థైరోగ్లాబ్యులిన్ ను, థైరాక్సిన్ మాంసకృత్తు సంబంధమగు పదార్థముల క్లిష్టమైన కలయికగా ఎంచవచ్చును. హేరింగ్ టన్ పండితుని కృషివలన థైరాక్సిన్ యొక్క నిర్మాణాకృతి సంపూర్ణముగా తేట తెల్లమయినది. ఈ జీవరాసాయనిక పదార్థమునందు ఐయొడిన్ కూడ ఉండుట గమనింపదగిన విషయము. శరీరమున గల అయొడిన్ అంతయు ఈ విధముగా థైరాయిడ్ గ్రంథి యందే పొందుపరచబడి యున్నది. తిను ఆహారములో అయొడిన్ తగినంతగా లేనియెడల, ఈ హార్మోనుయొక్క ఉత్పత్తి కుంటువడును.

2. పేరాధార్మోను : ఇది పేరాథైరాయిడ్ గ్రంధి యందలి హార్మోను. శరీరపోషణ విషయములో కాల్షియమ్ వహించు పాత్రను కనిపెట్టుచు, సరిచూచుకొనవలసిన బాధ్యత ఇది వహించును. ఇది శరీరమున లోపించినచో నిస్సత్తువయు, రక్తములో కాల్షియము లేమియు కలుగును. పేరాధార్మోను మాంసకృత్తుయొక్క నిర్మాణమును కలిగి యున్నట్లును, నిర్మాణాకృతిలో ఇన్స్యులిన్‌ను పోలి యున్నట్లును తెలియుచున్నది.

3. ఇన్ స్యులిన్: వృక్యమునందలి గ్రంధులనుండి స్రవించు హార్మోనునకు ఇన్స్యులిన్ అనిపేరు. శరీరపోషణమునకై పిండి పదార్థములు వినియోగపడు రీతిని క్రమపరచుటకై ఇది అవసరము. శరీరమున ఇన్‌స్యులిన్ తగ్గుటవలన అతిమూత్రవ్యాధి కలుగును. ఈ వ్యాధిచే పీడితులగువారికి రక్తమున చక్కెర ఎక్కువగుటయు, మూత్రముద్వారా చక్కెర అమితముగా పోవుటయు సంభవించును. వీరికి ఇన్స్యులిన్ ఇంజెక్షను ఇచ్చినచో అది ఈ వ్యాధి నయమగుటకు తోడ్పడును. ఈ హార్మోను నిర్మాణాకృతిని గురించి తెలిసికొనుట కష్టసాధ్యమయిన పని అయ్యెను. ఇన్స్యులిన్ అణుసంపుటి (molecule) భారము సుమారు 48,000 అని తెలియుచున్నది. ఇందు గంధకముతో కూడియున్న మాంసకృత్తు పదార్థములు కలవు. ఈ హార్మోనుయొక్క నిర్మాణాకృతిని గురించి అమూల్యమగు పరిశోధనములు జరిపి, ఈ క్లిష్ట సమస్యను పరిష్కరించినందులకు 1958 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము నందలి ప్రొఫెసర్ శాంజర్ అను నతనికి రసాయన శాస్త్రమున నోబెల్ బహుమాన మీయబడినది.

4. పిట్యుటరీ హార్మోనులు : పిట్యుటరీ గ్రంధిపై తమ్మె (lobe) నుండి ఒకరకమగు హార్మోనులును, క్రింది తమ్మె నుండి వేరొకరకమగు హార్మోనులును లభ్యమగుచున్నవి. పై తమ్మెనుండి ఉత్పన్నమగు హార్మోనులు శరీరము యొక్క పెరుగుదలకు ముఖ్యమైనవి. ఈ హార్మోనులు మిగిలిన గ్రంధులనుండి జనించు హార్మోనులపైనను, వాటి బాధ్యతలపైనను అజమాయిషీని వహించును. అందుచేత వీటిని అతిముఖ్యమగు హార్మోనులుగా పరిగణింపవచ్చును. ఇవిఅన్నియు మాంసకృత్తు సంబంధమగు పదార్థములే.

క్రిందితమ్మెనుండి జనించు హార్మోనులు శరీరమునందలి ఇతరభాగములందు గాక, అవి జనించినచోటనే వాటి ప్రభావమును చూపును. వీటిలో పిటోకిన్, పిట్రెస్సన్, మెలనోఫోరిక్ అనునవి ముఖ్యములు. మొదటిది మృదువైన కండరములను సంకోచపరచుటకును, రెండవది రక్తపుపోటు వృద్ధిచేయుటకును, మూడవది జంతువులలో రంజకమును, లేక వర్ణకమును, (Pigmentation) సరి చూచుటకును ఉపయోగపడును.

III లింగాధార హార్మోనులు : వృక్యగ్రంధిలోని క్రింది తమ్మెయొక్క ప్రేరణపై వీర్యస్థానములనుండి స్రవించు హార్మోనులకు లింగాధార హార్మోనులని పేరు. లింగాధార ప్రక్రియలను సరిచూచుట, శరీరారోగ్యముయొక్క అభివృద్ధికి తోడ్పడుట ఈహార్మోనుల కర్తవ్యమై యున్నది. పురుషలింగ హార్మోనులలో ఆండ్రోస్టెరోన్, టెస్టోస్టెరోన్ అనునవియు, స్త్రీలింగ హార్మోనులలో ఆయిస్ట్రోనులు, పోజెస్టెరోన్ అనునవియు ముఖ్యములు. వీటిని గూర్చిన కష్టతరమగు పరిశోధనములు జర్మన్ శాస్త్రజ్ఞు లయిన బ్యుటనాంట్, విండాస్, వీలేండ్ అనువారిచేతను స్విస్ శాస్త్రజ్ఞుడయిన రుజీకా వంటి ఉద్దండ పండితుల చేతను సలుపబడినవి. ఈ నలుగురుకూడ నోబెల్ బహుమానమును పరిగ్రహించినవారే. స్త్రీల అండాశయము (Ovary) నుండి ఆయిస్ట్రోనులు, ప్రొజెస్టెరోనులు జనించును. గర్భిణిస్త్రీల మూత్రమునుండియు లేక గుఱ్ఱముల మూత్రము నుండియు ఈ హార్మోనులను అతి స్వల్ప ప్రమాణములో బడయవచ్చును. లింగాంగములు క్రమ

504