Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గౌతమీ గ్రంథాలయము భాండాగారము" అను పేరున వ్యవహరింపబడదొడ గెను. అది పిదప పురమందిరమునుండి వేరొక ఇంటికి మార్చ బడెను. అప్పటికే మిక్కిలి ఉపయోగకారిగ నున్న ఆ పుస్తక భాండాగారము విద్యాధికులయిన యువకుల నాకర్షించినది. తదాదిగ యువకుల కృషివలన అది మిక్కిలి అభివృద్ధి నొంది తెలుగునాట ఉత్తమ గ్రంథాలయముగా పేరుగొన్నది. అప్పటికే, ఆ భవనమునందే 'శ్రీ సూక్తి సుధానిధి వడ్డాది సుబ్బారాయకవి ' గారి పేర “వసు రాయగ్రంథా లయము" అను పేరుతో శ్రీ అద్దంకి సత్యనారాయణశర్మ గారిచే 1911 వ సంవత్సరమున స్థాపింపబడి వేరొక గ్రంథా లయము నడుపబడుచుండెను. ఈ రెండు గ్రంథాలయము లకు పాలక వర్గమునకు సభ్యులు ఎక్కువనుంది ఒక్క రే అయియుండుట వలన వారందరు, ఆ రెండు గ్రంథాలయ ములను కలిపి యొక పెద్ద గ్రంథాలయ మొనర్చినచో, అది తప్పక ప్రజాదరమును ప్రభుత్వాదరమును పొంద గలదని తలచిరి. ఆ రెండింటిని సమ్మేళన మొనర్చిరి. దానికి 'గౌతమీ గ్రంథాలయము' అను నామకరణ మిడి 1920వ సంవత్సరములో రెజిస్టరు చేసిరి. అంతట ఆ గ్రంథాలయమున కొక నూతన గృహ నిర్మాణముచేయు తలంపు కార్యనిర్వాహకులకు కలి గెను. కొంతకాలమునకు వారి యత్నము సఫలమయ్యెను. వారు 1923 వ సం. రమున పట్టణమునకు మధ్యభాగ ముననున్న ఒక విశాలభవనమును సంపాదించిరి. దాని యందు ఆ గ్రంథాలయము అభివృద్ధి చెందుచు వచ్చెను. ఇట్లుండు ఆ పట్టణముననే మరియొక దిక్కున శ్రీ కొక్కొండ వేంకటరత్నక విగారి పేర కొందరిచే ఒక గ్రంథాలయము నడుపబడు చుండెను. గౌతమీ గ్రంథాలయములో నొక కార్యకర్తయగు శ్రీ బోడపాటి సత్యనారాయణగారి కృషివలన ఈ 'రత్నకవి' గ్రంథాలయము ఈ గౌతమీ గ్రంథాలయమున విలీనము గావింపబడెను. ప్రజలవలనను, ప్రభుత్వమువలనను, సహాయసంపత్తి నొందుచు ఇది దిన దినాభివృద్ధి నొందసాగెను. ఈ గౌతమీ గ్రంథాలయమున ప్రస్తుతము లిఖిత తాళ పత్ర గ్రంథములును, తదితరములయిన వ్రాతప్రతులును, సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము, హిందీ, ఓడ్రము, 494 సంగ్రహ ఆంధ్ర కన్నడము, అరవము, అను భాషలలో ముద్రితములయిన గ్రంథములును కలిసి ఇప్పటికి సుమారు 50,000 గ్రంథము లున్నవి. ఇందు చరిత్రకు సంబంధించిన పుస్తకములు చాల కలవు. ఋగ్వేదమునకు తెలుగుపద్యరచనము (అముద్రి తము) కలదు. కైఫీయతులును గలవు. ఇది పరిశోధన గ్రంథాలయముగ విశ్వవిద్యాలయములచే గుర్తింపబడినది. ఇందలి గ్రంథము లిట్లు విభజింపబడినవి : (1) ఆర్ష గ్రంథములు - శ్రుతులు, ఉపనిషత్తులు, స్మృతులు, ధర్మ శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, మాహా త్మ్యములు, వ్రతములు, స్తోత్రములు, మతము, వేదాం తము, కులపురాణములు, వంశ చరిత్రలు. (2) పద్యములు - పద్యకావ్యములు (ప్రాచీనములు, ఆధునిక ములు), నీతి పద్యములు, శతకములు, దండక ములు, అవధానములు, చాటువులు. (3) నాటకములు, ప్రహసనములు; (4) నవలలు. (5) గద్యము : వచన కావ్యములు, కథలు, వినోద ములు; పౌరాణిక కథలు ; (8) చరిత్రము : దేశ చరిత్రములు, జీవిత చరిత్రములు, (7) ఉపన్యాసములు (నై తిక సాంఘిక ములు) ; (8) శాస్త్రములు: ఆర్థిక, పారిశ్రామిక, కృషి, గాన, భరతశాస్త్రములు, జ్యోతిశ్శాస్త్రము, న్యాయశాస్త్రము, పాకశాస్త్రము, ప్రకృతి శాస్త్రము, జీవశాస్త్రము, భూగోళశాస్త్రము, రాజ్యాంగశాస్త్రము, సివిక్సు, వాస్తు శాస్త్రము, వైద్యశాస్త్రము, శరీర - ఆరోగ్య శాస్త్రము, వివిధ శాస్త్రములు. (9) భాషా గ్రంథములు: నిఘంటువులు, లోకోక్తులు, వ్యాకరణము, అలం కారము, లక్షణ గ్రంథములు, విమ ర్శనములు, కవుల చరిత్రలు. 10. పదములు, కీర్తనలు, హరికథలు, యక్షగాన ములు, పదములు, పాటలు. 11. వాచకములు. 12. వార్షిక చర్యలు, నిబంధనలు, పట్టికలు. 13. పత్రికలు. 14. సంస్కృతగ్రంథములు, కావ్యములు, నాటక ములు, లక్షణగ్రంథములు. 15. హిందీ గ్రంథములు.