Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ సుల్తానులు 488 సంగ్రహ ఆంధ్ర


అలా భాగ్యమతి నుద్దేశించి వ్రాయబడినదని పండితులు చెప్పు చున్నారు. మహమ్మద్ కులీ స్వయముగ గొప్పకవి. ఇతడు తన ప్రియురాండ్ర నుద్దేశించి వ్రాసిన ప్రేమగీతి కలు నేటికిని సహృదయుల నాకర్షించుచున్నవి. మహమ్మ దీయులయొక్కయు, హిందువులయొక్కయు పండుగ లపై కూడ ఇతడు కొన్ని గీతికలు రచించెను. కాలమున కూడ ఎన్ని యో చారిత్రక గ్రంథములు రచింప బడినవి. ఈతని సోదరి ఉత్తమకవయిత్రి. గోలకొండ సుల్తానులు 'దక్కనీ ఉర్దూ' అను ఉర్దూమాండలిక మును అభివృద్ధి పరచి పోషించినందున ఉర్దూ వాఙ్మయచరిత్రలో వారికి ప్రత్యేక స్థానము లభించినది. దక్కనీ ఉర్దూ కూడ కావ్యరచనా స్థాయి నందుకొనజాలెనని బీజాపురము, గోలకొండవారు సోదాహరణముగ నిరూపించిరి. ఈ కాల మున ప్రణయగాథా కావ్యములు, వీరగాథలు, మస్నవీ, గజల్, ద్విపద, పద్యసంకలనములు, ప్రణయగీతికలు. మర్సియా మున్నగు కావ్యప్రక్రియలకు అధిక మైన ఆద రము లభించినది. కావుననే ఉర్దూ వాఙ్మయమున కిది స్వర్ణయుగమని చెప్పవచ్చును.

గోలకొండ కథలు - గాథలు : విజయనగర సామ్రాజ్య సంపదకును, తదితర రాజ్యవై భవములకును సంబంధించిన గాథలు జనబాహుళ్యమున ప్రచారము నొందినట్లే, గోల కొండకు సంబంధించిన గాథలును నేటికిని హైదరా బాదులో పెద్దలలో వ్యాప్తిలో నున్నవి. ఇట్టి గాథలలో చారిత్రికాధారములు కలవి కొన్నియు శ్రుతి ఆధార ములు గలవి కొన్నియు, కేవల కల్పితములు మరికొన్నియు కలవు. ఇట్టి గాథలలో, భాగ్యమతి ప్రణయగాథ, గోల కొండ కోహినూరు వృత్తాంతము, అబ్దుల్ రజాక్ లారి వీరరసాత్మక గాథ, గోలకొండ సుల్తానులకును, ప్రధానాధి కారులకును సంబంధించిన గాధలు, చార్మినారు మక్కా మసీదు, గోషామహలు, బారాదరి, మిల్క్ మహల్, పురానాపూల్ మున్నగువాటి నిర్మాణమునకు సంబంధిం చిన వింతగాథలు, ఆంధ్ర మంత్రులగు అక్కన్న మాదన్న వృత్తాంతములు, రాజకుమారులకు, రాణివాసములకు, రాజకుమా ర్తెలకు, ప్రియురాండ్రకు, మతగురువులకు సంబం ధించిన చిత్రవిచిత్రములైన గాథలు ఎన్నియో కలవు.

గోలకొండ పరిపాలనా యంత్రము: గోలకొండ ప్రభువులు నిరంకుశులై వర్తించినను, తగిన అధికారవర్గమును నియమించి వారి సలహా ననుసరించి దేశమును పాలించిరి. అన్ని విషయములందును సుల్తానుల మాటయే వేదవా క్కుగా భాసిల్లెను. అయినను రాజ్యనిర్వహణమునకు సంబంధించిన ప్రధానాధికారులు కొందరుండిరి. ప్రధాన మంత్రి పదవిని అలంకరించువానిని ' వేష్వా' అనుచుండిరి. ముస్తఫాఖాన్, మీర్ మోమిన్ అనువారు పేష్వాలై. సింహాసనమునకు ఎడమ వైపుననున్న గౌరవస్థానమును అలంకరించిరి. రెవిన్యూ, ఆర్థిక శాఖల ఆధిపత్యమును వహించువారిని 'మీర్ జుంలా' అనుచుండిరి. ముల్లాతఖీ, మీర్జా మహమ్మద్ మున్నగువారు ఈ పదవి నలంకరించిన వారు. సై న్యాధికారిని 'ఆయిన్ ఉల్ ముల్క్' అని పేర్చొను చుండిరి. అకౌంట్సు, ఆడిట్ శాఖలను నిర్వహించిన ఉప మంత్రిని 'మజుందార్ ' అనుచుండిరి. 'నాజిర్ ' అనగా ఇన స్పెక్టరు. ఇప్పటికిని విద్యాశాఖలో కొందరు నాజిర్ అను పదవిని నిర్వహించుచున్నారు. రాజకీయవ్యవహారములు, ఉత్తర ప్రత్యుత్తరములు నిర్వహించుట, శాసనములు, ఉర్దూలోను, తెలుగునందును వ్రాయించుట మున్నగు పనులు చేయువారిని 'దబీరు' అని పేర్కొనిరి. పోలీస్ కమీ షనరును 'కొత్వాలు’అని పిలుచుచుండిరి. ఈ పదవికూడ మొన్న మొన్నటి వరకును అమలులో నుండెను. వీరు కాక హవల్దారు, జమేదారు మున్నగు ఇతర అధికారు లెందరో ఉండిరి. గోలకొండ ప్రధానాధికారవర్గమును గూర్చి వాయునపుడు ఆంధ్రమంత్రు లగు అక్కన్న మాదన్న మహా భాగులను గూర్చియు, భద్రాచలము తహసీల్దారుగ నున్న కంచర్ల గోపన్న మహాశయుని గూర్చియు విస్మ రింపజాలము. సుల్తానుల అత్యాదరణము నొంది ప్రధా నాధికారులై వరలిన వీరు ఆంధ్రులై యుండుట గర్వ కారణము. వీరు తమ మేధా సంపన్నతచేతను, పరిపా లనా దక్షతచేతను, దూరదృష్టి చేతను, మహమ్మదీయ సుల్తానుల అనుగ్రహమునకు పాత్రులై, అపర యుగంధ రులుగా కీర్తి నొందిరి. వీరు పారశీక వాఙ్మయమునందు పాండిత్యము కలిగి ప్రఖ్యాతులైనవారు. వీరి పాండితీ గరిమను, పరిపాలనా దక్షతను గుర్తించక అసూయా పరులై వీరిని పదవీభ్రష్టులను చేసినందున అచిర కాలము ననే దేశము అన్యాక్రాంత మైనది.