విజ్ఞానకోశము - 3
గెలిలియో
గెలిలియో పదునేడవ యేట (1581) లో వైద్యవిద్య నభ్యసించుటకై 'పైసా' విశ్వవిద్యాలయమున చేరెను. అచ్చట ఒకనా డొక చర్చిలో వ్రేలాడగట్టబడిన దీపము ఊగులాడుట చూచి, తన నాడితో దానిని పోల్చి, "లోలకముల సమకాలికత్వము” (Pendulum isochronism) అను సూత్రమును కనిపెట్టెను. తరువాత లోహపు గుండు నొక దానిని దారముతో వ్రేలాడగట్టి, లోలకము కురుచ అగుచున్న కొలది అది ఊగుటకు తక్కువ కాలము పట్టుననియు, అది ఊగుచున్న దూర మెంత అయినను ఒకసారి ఊగుటకు పట్టుకాలము మారదనియు నిశ్చయించెను.
యూక్లిడుయొక్క గణిత గ్రంథములను చూచుట తటస్థించుటచే, నాత డట్లే గణిత, భౌతికశాస్త్రము లందు మంచి పాండిత్యము సముపార్జించెను. ప్రాచీనుడగు అర్కిమెడీసు వ్రాసిన ద్రవస్థితిశాస్త్ర (Hydrostatics) విషయములు శ్రద్ధగాచదివి, ద్రవస్థితిత్రాసు (Hydrostic balance) ను కనుగొనెను. 1584 సం. నాటికి 'పైసా' విశ్వవిద్యాలయము నందే ఈతడు గణిత శాస్త్రాచార్యుడుగా నియమితు డయ్యెను.
గెలిలియోకు పూర్వము శాస్త్రజ్ఞులలో ప్రయోగాత్మకముగా విషయ నిరూపణ మొనరించు అలవాటు లేకుండెను. అట్టిస్థితిలో వారికి మొట్టమొదటిసారిగా వైజ్ఞానిక దృష్టిని కలుగజేయుటకై ప్రయత్నము సలిపినవా డాతడు. మానవుడు తాను చూచు విషయము లన్నియు ఎందుల కట్లు జరుగుచున్నవని ప్రశ్నించుట కన్న అవి ఎట్లు జరుగుచున్నవను విషయమును గూర్చి విచారించుట ఈతని దృష్టి. అనగా ఒక కార్యము ఎందులకు జరిగినదని విచారించుటకన్న ఆ కార్యము జరిగిన క్రమమును పరిశీలించుట వైజ్ఞానిక దృష్టి యని అర్థము.
రెండువేల సంవత్సరముల క్రిందట చనిపోయిన అరిస్టోటిల్ సిద్ధాంతములనే ఈతని కాలపువారు విశ్వసించు చుండిరి. కాని గెలిలియో స్వేచ్ఛగా నాలోచించు శక్తిమంతుడు, అరిస్టోటిల్ సిద్ధాంతము ప్రకారము రెండు వస్తువుల నొకేదూరము నుండి ఒకేసమయమున భూమిపై పడవేసినపుడు వాటిలో బరువైన వస్తువు రెండవదానికన్న వేగముగా భూమిని చేరవలెను. గెలిలియో దీనిని అశాస్త్రీయమని నిరూపించుచు, పైసానగరమున ఏటవాలుగా నున్న ఒక ఎత్తైన భవనము మీది నుండి గురు, లఘు పరిమాణములు గల రెండు ఇనుప గుండ్లను జారవిడిచి, రెండును ఒకేసమయమున భూమిని చేరునని నిదర్శన పూర్వకముగా నిరూపించెను.
చిత్రము - 114
గెలిలియో
క్రీ. శ. 1592 నుండి 1610 వరకు 'పడువ' (padua) విశ్వ విద్యాలయము నందు గణిత శాస్త్రాచార్యుడుగా నుండి, గొప్ప ఉపాధ్యాయుడుగాను, ఉపన్యాసకుడు గాను చాల ప్రసిద్ధిగాంచెను. ఆ రోజులలో ఆయన గాజు గోళమునకు పొడుగాటి గొట్టము తగిలించి, గొట్టముయొక్క కొనను నీటిలో ముంచి, కొంతవరకు నీటితో పూరింపబడిన గొట్టమును ఉష్ణమాపకముగా ఉపయోగించెను. అట్లు గెలిలియో మొదటి ఉష్ణమాపకమును తయారుచేసెను.
గెలిలియో మొదటి నుండియు కోపర్నికస్ సిద్దాంతము లందు నమ్మకము కలిగియున్నను, దానిని బహిరంగపరచ లేదు. అరిస్టోటిల్ సిద్ధాంతము ప్రకారము ఖగోళమునందు మార్పులేమియు జరుగవు. (Incorruptability of heavens). గెలిలియో 1604 లో అంతరిక్షమున తేజోవంతముగాప్రకాశించు ఒకానొక నక్షత్రమును గమనించి, దానిని సూర్య కుటుంబమున కెంతో ఆవలగల ఒక స్థిరమైన నక్షత్రమని నిరూపించెను. ఆకాలము నందే వెలుతురు, రంగు, గతిశాస్త్రము (Dynamics), యంత్ర గతిశాస్త్రము (Mechanics) మొదలగు విషయములపై గ్రంథములను రచించెను. స్ల యిడు రూలు తయారుకాక పూర్వమే సంవర్గమానములు (Logorithms) కనిపెట్ట బడక పూర్వమే క్రీ. శ. 1606లో ప్రొపోర్షనల్ కాంపస్
429