Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

= 8విజానకోశము

మున కేగెను ; కాని చదువుమాత్ర మచుట క్రమబద్ధముగ సాగిలేదు. గ్రంథ పఠనమునం దాతని కాసక్తి లేకుండెను. తన కచట సంఘటిల్లిన ప్రణయోదంతమునే కథావస్తువుగా గ్రహించి, యతడొక నాటకము నపుడు రచించెను. తన హృదయమును అత్యంతము సంచలింపచేసిన వివిధానుభూతులను అతడు చిన్న గీతికలలో వర్ణించుచు, ఆత్మాశ్రయ కవిత్వమునకు పెక్కు క్రొత్త సొగసులను తీర్చెను. ఈ విధముగ లైవ్ జిగ్ లో మూడేండ్లు గడచిన వెనుక అతడు తీవ్ర మైన యనారోగ్యమునకు గురియగుటచే ఇంటికి తిరిగి పోవలసివచ్చెను. శరీరము చాల నీరసించుటచే సుమారు రెండుసంవత్సరముల పాటాతడు మంచము పట్టియుండెను. అప్పుడతనికి వాన్ టెన్ బర్గ్ అను స్నేహశీలతో సన్నిహిత సంబంధ మేర్పడెను. ఆమె స్నేహ ప్రభావమున గెటే తన దృష్టిని ఆధ్యాత్మిక పథము మీదికి మరల్చేను. మతమును గూర్చి, దైవమును గూర్చి, ముక్తిని గూర్చి పెక్కు రచనలలో గెటే వెల్లడించిన భావము లన్నిటికిని అతని హృదయ క్షేత్రమునం దపుడే బీజ నిక్షేపము కావింపబడెను. అపు డతడు ప్రచురించిన మధుర గీతములను తానే గడ్డిపువ్వులతో పోల్చెను.

శరీరమునకు స్వస్థత చిక్కిన తరువాత గెటే న్యాయ శాస్త్ర పఠనమును ముగించుటకు ఈ పర్యాయము స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయమున కరిగెను. అచ్చట అతనికి ప్రసిద్ధ జర్మన్ రచయిత హెర్డర్ తో సఖ్యమేర్పడెను. ఈ మైత్రికి పర్యవసానముగ సాహిత్యము నందలి వివిధ రీతులను గూర్చి గేపేకు సునిశ్చిత మైన దృక్పథ మేర్పడెను. ఉత్తమ సాహిత్యమునకు స్వచ్ఛందమైన యనుభూతియే నికషో పలము వంటిదని పార్డర్ విశ్వాసము. అతనితోడి మైత్రి వలన గెటే జర్మన్ జానపద వాఙ్మయ సౌందర్యమును, హోమర్, షేక్స్ పియర్ మహాకవుల కావ్యనాటకము లందలి రసరామణీయకములను చక్కగా గ్రహించెను. నాటి నుండి యతడు ఫ్రెంచి సాంప్రదాయిక కవిత్వపు నియమ బంధములను త్రెంచివేసి, తన వ్యక్తిత్వమునకు అనుకూలమైన నూత్నపథములలో కవిత్వ రచనకు ఉపక్రమించెను. అచట నొక పల్లెపడుచు పై తనకు జనించిన యనురాగమును వెల్లడించుచు గెటే రచించిన భావగీత ములు జర్మన్ భాషలోని గేయ వాఙ్మయమునందు అత్యున్నత స్థానమును ఆర్జించుకొన్నవి. ఈ గీతముల విశిష్టతకు మూలమందు అడుగడుగున కానవచ్చు రసధ్వని, వాచ్యముగ వాని యందు ప్రకటితమైన భావముల కంటె అవి స్ఫురింపజేయు వ్యంగ్యార్థము అత్యంత రమణీయముగ నుండుటయే వాని ప్రశస్తికి ముఖ్య కారణము.

గెటే 1771 లో న్యాయశాస్త్రమున పట్టభద్రుడై ఫ్రాంక్ ఫర్ట్ పట్టణమునకు తిరిగివచ్చి న్యాయ వాద న్యాయవాద వృత్తిని స్వీకరించెను. మూడేండ్ల తరువాత, 1774 లో “ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్తర్" అను నవల నతడు ప్రకటించెను. ప్రకృతిని, పసిపాపలను, కల్లకపటము లెరుగని కష్టజీవులను, నిరాడంబర జీవితమును ప్రేమించు సుకుమార హృదయు డొకడు సమాజమునందు వ్యాపించియున్న స్వార్థపరత్వమును, కాఠిన్యమును చూచి భరింపలేక, పరునకు భార్యగా నిశ్చయింపబడిన పడుచు పై తనకు గలిగిన ప్రేమను అణచుకొనలేక, నిరర్థక మును, నిరాశాపూరితమునగు బ్రతుకు బరువును మోయలేక, తుద కాత్మహత్య గావించుకొనుట ఇందలి ఇతివృత్తము. ఆ నవల ప్రకటిత మైన యనతికాలముననే జర్మన్ పాఠక లోకమును ఆశ్చర్య చకితము గావించి, క్రమముగ గెటే కీర్తి లతలను యూరప్ ఖండమునందంతటను అలముకొన జేసెను. అతని కృతులలోనికెల్ల తలమానికమని పండితులచే భావింపబడుచున్న 'ఫాస్ట్' నాటకమునకు సైతము అంకురార్పణ మపుడే జరిగెను.

తరువాత 1775 లో గెటే 'ఎగ్మాంట్' అను విషా త నాటక మును రచించుచుండగా 'వీమార్' పరిపాలకుడగు కార్ల్ అగస్టస్ అతనిని స గౌరవముగ తన సభ కాహ్వానించెను. క్రమముగ వారి స్నేహము దృఢ మగుటచే, కార్ల్ అగస్టస్ గెటేకు తన కొలువులో నొక మంత్రిపదవి నొసగి, యావజ్జీవిత మతనిని తన చెంతనుంచు కొనెను. నాటినుండి రాజకీయ వ్యవహారములలో తల మున్కలగుచుండుటవలన గెటే కొంతకాలము సాహిత్య వ్యాసంగమునకు స్వస్తి చెప్పవలసివచ్చెను. ఈ నూతన వాతావరణమునం దతడు అవకాశము లభించినపు డెల్ల వృక్ష, జంతు, ఖనిజ, భూగర్భశాస్త్రముల నభ్యసించుచు, తన పరిశోధనలకు పర్యవసానముగా వృక్షజీవితమునందలి పరిణామములనుగూర్చి యొక వ్యాసమును ప్రకటించెను.