Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 381 గుజరాతుదేశ చరిత్రము

చోట మనకు కల్గును. 'లోధల్' నందు అనేక చక్కని కట్టడములు గలవు. ఇచట రాసలీలను అనగా శ్రీకృష్ణుని శృంగార చేష్టలను ఒక ఆలయ కుడ్యములపై అత్యం తా కర్షకముగా శిల్పులు చెక్కియుండిరి. జైన బౌద్ధ విగ్రహ ములు, ధర్మచక్రము మొదలగునవి ఎన్ని యో ఇచ్చట కాననగును. “గిరినార్" అనుచోట మౌర్యుల శాసన ములు గలవు. ప్రాచీన కాలపు కట్టడములు కొన్ని నేటికిని అదే దశయందున్నవి. ఆ కట్టడములవలన ఈ ప్రాంతమున నిష్ణాతులైన వాస్తుశాస్త్రజ్ఞులున్నట్లు తెలియును. అది యునుగాక 'మొగలుల కాలమున కట్టడములందు గుజ రాతు వాస్తుశాస్త్రజ్ఞుల హస్తమే ప్రధానమైనదని చెప్పు దురు. ఇచటివారు వాస్తుశాస్త్రమునందే గాక చిత్రకళ యందు కూడ ఆరి తేరినవారని చెప్పవచ్చును. వస్త్రము లపై గల జరీ పనితనము చూపరులకు వింతగొల్పును. జరీ పనితనము ఇచటివారి చిత్రకళా నై పుణ్యమును తెలియ జేయును. గాజు పై వీరు రంగురంగులతో చిత్ర విచిత్రము లైన ఆకృతులను చిత్రించిరి. చిత్ర సమేతములై న పింగాణీ పాత్రలు కూడ పూర్వకాలమందలివి లభ్యమైనవి. ఈ ప్రాంతమున ఒక్కొక్క కళ ఒక్కొక్క స్థాయిలో పెం పొం దెను. వీరి ఉత్సవములలో 'డోలోత్సవ' మనునది ప్రసిద్ధిగాంచినట్టిది. ఈ ఉత్సవమును శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఎంతో వేడుకగా జరుపుకొందురు. తమ గృహాంగ ణమునందు ఊయెలను కట్టి దాని నత్యంత సుందరముగా నలంకరించి, అందు శ్రీకృష్ణుని విగ్రహమునుంచి, భక్తి శ్రద్ధలతో పూజించి, శ్యామలగీతములను అతి శ్రావ్య ముగా పాడుచు, ఊయెల నూపుదురు. ఈ ఉత్సవమునందు ఆబాలగోపాలము పాల్గొని అమితానందమును పొందు దురు. పౌరాణిక యుగమునుండియు క్రమేణ వచ్చు చున్న కొన్ని కళలు ఆంగ్లేయ పరిపాలనా కాలమున మందగించె నని చెప్పుదురు.

ఈ ప్రాంతీయుల ముఖ్యవృత్తి అధికముగా వ్యాపా రమే. వీరు సాహసచాతుర్యములు గలవారు. వ్యాపా రమునందు ముందంజ వేసి ఉన్నతస్థితికి వచ్చిన వారు వీరే నని చెప్పవచ్చును. ఇచ్చటి రైతులు ఉదారులు ; ఉత్సాహ వంతులు. ఇచ్చటివారు వ్యాపారవిషయమున ఆరి తేరిన వారు గావుననే, షాజహాన్ తన కలయందు గుజరాతుశ్రేష్ఠులను నియోగించెను. వీరు లెక్క లయందు అతి నిపుణులు. మున మహా

సౌరాష్ట్రము : సౌరాష్ట్రమునకు ప్రాచీన నామము సురాష్ట్రము. మహాభారతమున ఈ సౌ రాష్ట్రమును 'కృష్ణభూమి' యనిరి. మౌర్య. గుప్త రాజుల కాలమున 'సురాష్ట్రమ' ని వ్యవహరించిరి. మహమ్మదీయుల కాల ఈ రాష్ట్రమును 'సోదర్ ' అనియు, రాష్ట్రుల కాలమున 'కఠియా వాడ్' అనియు వ్యవహ రించిరి. 1948 నాటికి పూర్వము ఇది చిన్న చిన్న సామంత రాజ్యములుగా విభజించబడియుండెను. 1948 సం॥ న వీనినన్నిటిని కలిపి సౌరాష్ట్రమని పేరిడిరి.

వైదిక కాలమున యీ సౌరాష్ట్రముయొక్క భోగోళిక స్థితి వేరుగానుండెను. సింధునది సౌరాష్ట్రమందలి 'ఝాల్ వాడ్' అను ప్రదేశమున ప్రవహించుచు, 'ఖండాత్ ' అఖాతమున కలియుచుండెడిది. ఐతిహాసిక కాలమందు సౌరాష్ట్ర మధ్యప్రాంతమున దట్టమైన అడవులుం డెడివి. కావున జనులా ప్రాంతమున నివసించలేదనియు, సాగర తీరముననే యెక్కువగ నివసించిరనియు చరిత్ర కారుల ఊహ, సౌరాష్ట్రీయుల సంస్కృతికి 'సాగర సంస్కృతి' యని పేరుగూడ కలదు. కాన పౌరాణికులు సాగర తీరములందు నివసించుట చేతను, అచటనే వారి సంస్కృ తికి సంబంధించిన చిహ్నములు ప్రాప్తించుటచేతను వారి సంస్కృతికి 'సాగరసంస్కృతి' యని నామకరణము చేసి యుండవచ్చును. ఆనాడు ద్వారక సామాజిక, సాంస్కృ తిక, వ్యాపార కార్యకలాపములకు కేంద్రమైయుం డెను.

సౌరాష్ట్రమున త్రవ్వక పు పరిశోధనలవలన బయల్పడిన వస్తుజాలము సింధు సంస్కృతికి సంబంధించినది. ప్రాచీన నవీన శిలాయుగమునకు సంబంధించిన వస్తుజాలము ఈ ప్రాంతమున అధికముగా దొరకెను. ఇచ్చట లభ్యమైన సాంస్కృతిక వస్తుజాలమునుబట్టి ఈ ప్రాంతము సంస్కృ తుల సంగమస్థానమని తెలియుచున్నది. సౌరాష్ట్ర, గుజ రాతు సంస్కృతులు ఇంచుమించు ఒకే సంస్కృతికి సంబంధించినవై యున్నవి. ఆదిమవాసులైన ఆర్యులు సౌరాష్ట్ర మధ్యభాగమున నున్న దుర్గమారణ్య ప్రాంత మున నివసించిరి. కాలక్రమమున ఆ యడవి ప్రదేశమున నున్న వారు ముఠాలుగా బాటసారులను