Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భధారణము - ప్రసవసమస్యలు

సంగ్రహ ఆంధ్ర

"హైడెటి ఫారం మోల్": మావి గుత్తుల సమూహముగా మార్పుచెందును. అది గర్భాశయమంతయు ఆక్రమింపవచ్చును. అది గర్భాశయపు గోడను తలక్రిందులు

చిత్రము - 99

పటము - 6

హైడేటిఫారంమోలు

ఇందు పింపము ద్రాక్షగుత్తిలాగున మారి ఉన్నది.

చేసి రక్తప్రవాహముద్వార ఇతరప్రాంతములకు ప్రాకుట అరుదుగా సంభవించును. అట్లు జరిగిన యెడల అది చాల ప్రమాదకరము. గర్భస్థమైన పిండపు భాగములు స్పర్శకు గోచరింపవు. యోనినుండి వచ్చిన స్రవములో చిన్న గుత్తులవంటివి కనబడును. గర్భాశయములోని తిత్తులను తీసి వేయుటయే ఇందులకు జరుపవలసిన చికిత్స.

హైడ్రోమియాస్ (గర్భాశయములో ఎక్కువ నీరు పట్టుట) : గర్భాశయములోని పిండము 'యేమ్నియాటిక్ ద్రవము' అనుదానిచే కప్పివేయబడును. అది 3000 C.C. కంటె ఎక్కువగా ఉండరాదు. హైడ్రోమియాస్‌లో అది చాలా ఎక్కువగా ఉండును. గర్భాశయము మిక్కిలి పెద్దదియగును. శరీరావయవములపై ఒత్తిడి కలుగుటచే ఊపిరి ఆడకపోవుట, గుండె కొట్టుకొనుట జరుగును. కొద్ది తరహాలో వచ్చినచో, సవ్యమగు ప్రసవము జరుగవచ్చును. కాని తీవ్రముగా వచ్చినయెడల తల్లి ఆరోగ్యమును రక్షించుటకై సకాలమునకు చాలా ముందుగనే ప్రసవము కలిగింపవలసి యుండును.

ఆలిగో హైడ్రామ్నియాస్ : ఇందులో నీరు తక్కువగా నుండును. కావున శిశువు యెమ్నియాటిక్ పొరకు అంటుకొని ఉండుటచే, పిండము చనిపోవుటకు ఎక్కువ అవకాశము కలదు.

గర్భాశయపు త్రాడు : ఇందు నిజమైనవి కాని కృత్రిమమైనవి కాని ముడు లుండవచ్చును. ఈ త్రాడు 4-5 అడుగుల ఎక్కువ పొడవునుగాని, 2-3 అంగుళముల తక్కువ పొడవునుగాని కలిగియుండవచ్చును. ఈ రెండు పరిస్థితులలోను ప్రసవ సమయమున ఎక్కువ కష్టము కలుగును. ప్రసవ సమయమునం దీ త్రాడు శిశువునకు పూర్వమే ముందునకు వచ్చును. దీనిని తిరిగి స్వస్థానములో చేర్చవలెను. గర్భమందలి పిండమునకు ఆహారమైన ప్రాణవాయువు ఈ త్రాడు గుండానే పోవును. కనుక అట్లు దీనిని స్వస్థానమున చేర్చినయెడల బిడ్డ బ్రతుకును.

మావి (బీజబంధము) : గర్భస్థ పిండమునకు ఈ అవయవము వలన మిక్కిలి మేలు కలుగుచున్నది. వ్రేళ్ళ వలె ముందునకు వచ్చు దీని భాగములు గర్భాశయము యొక్క గోడలోనికి చొచ్చుకొని యుండును. ఈ విధముగా గర్భస్థ పిండము తల్లి యొక్క రక్తము దగ్గరకు వచ్చును. కాని ఈ రెండును కలియవు. ఎందుచేతననగా ఈ రెంటికి మధ్య సన్నని పొర యొకటి ఉండును. దీని ద్వార శిశువు వాయువును, ఆహారపదార్థములను గ్రహించును. కొన్ని మావులు రెండు మూడుగా విభజింపబడి యుండును. లేదా మరొక చిన్న మావు వేరుగా ఉండ వచ్చును. ఇది ఒక్కొక్కసారి వాచుట లేక గట్టిపడుట జరుగవచ్చును. లేదా దానికి క్షయ మొదలగు రోగములు అంటవచ్చును.

గర్భస్రావము: దీనిని గర్భ విచ్ఛిత్తి అని కూడ అందురు. అనగా గర్భధారణ కాలమునందు మధ్యలో గర్భములోని పిండమునకు పూర్తిగా శక్తి సంపన్నత కలుగకపూర్వమే, అనగా 28 వారములకు ముందుగనే అది బయటకు వచ్చుట అని అర్థము. తల్లి యొక్క అనారోగ్యము, సెగవ్యాధి, రసాయనిక టాక్సినులు తమ 'పని

320