Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 పోవును. ధ్రువముల యొద్ద ఆ వేగము శూన్యమగును, నిరక్షరేఖ యొద్ద అది గరిష్టంగా నుండును. నిమిషము నకు సుమారు 18 మైళ్ళు. భ్రమణము - కాలము : 24 గంటల పరిమితిగల ఒక పూర్తి భ్రమణము ఒక సౌరదినమనబడును. గంటకు 60 నిమిషములు, ఒక్కొక్క నిమిషమునకు 60 సెకండ్లు. సూర్యుని ప్రథమ కిరణముయొక్క ఆవిర్భావము ఉదయ మనబడును అల్లి అంత్య కిరణముయొక్క అంతర్ధానము అస్తమయమనబడును. సూర్యుడు ఆకసముని అత్యున్నత స్థానమును ఆక్రమించిన కాలము మిట్టమధ్యాహ్నమన బడును, పడమరనుండి తూర్పునకు భ్రమణముండుటచే తూర్పుభాగమునందు కాలము పురోగతిలో నున్నట్లును పశ్చిమ భాగమునందు వెనుక బడుచున్నట్లును ఉండును. ఈ భేరము యామ్యోత్తర రేఖలనుబట్టి ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషముల చొప్పున ఉండును. ప్రాక్పశ్చిమములను గూర్చి నిశ్చితాభిప్రాయము కలుగుటకై గ్రీనిచ్ గుండా ధ్రువములను కలుపుచు 0° రేఖాంశ వృత్తము (లేక ప్రధాన యామ్యోత్తర రేఖ) గీయబడెను (ఊహారేఖ). దానికి తూర్పుగా 180 యామ్యోత్తర లేథామండలములు పడమరగా 180 యామ్యోత్తర రేఖామండలములు ఒక్కొక్క డిగ్రీ వ్యవధిలో కలవు. ఒక యామ్యాత్తర రేఖమీరి సరియగు కాలము దానిమీదనుండు ప్రదేశము -లన్నిటియందు స్థానిక కాలము (local time) అగు చుండును. రెండు ప్రదేశములందుగల స్థానిక కాలము లందలి భేదము, ఆ ప్రదేశములలో ఒక దానిమీద నున్న యామ్యోత్తరరేఖనుండి మరియొక ప్రదేశము మీద నుండు అట్టి రేఖమీదికి ఒక నక్షత్రము పోవులకు పట్టు శాణమునకు సమానము. ఈ కాలభేరము ఆ రెండు ప్రదేశములమీద నుండు యామ్యాత్తరరేఖల (longitudes) అంతరమును (interval) తెలుపును. దానిని 24 గంటలకు 360 చొప్పున డిగ్రీలలోనికి మార్చుకొనవచ్చును. గణనముందని సౌలభ్యము కొరకై ప్రపంచము వెల్ల 26 కాల మండలములుగా విభజించిరి. ప్రతి వరున మండలమునందును ఒక గంట భేరముండి అయా మాండ బిక కాలము తెలుపబడు చుండును. గ్రీటెడ్ కాలము సార్వత్రికముగా (universal) ప్రపంచమునకు చెందిన కాలము: ఇది పశ్చిమ యూరప్ దేశము అన్నింటిచేతను స్వీకరింపబడుచున్నది. కాని బ్రిటనునందలి “వేసవికాలము (summer)"నకును పశ్చిమ దేశముల యందలి వేవి కాలమునకును భేదము కలదు. ఒక దేశమునకు రాజ ధానియగు నగరమునందుగాని, ఇతర ప్రధాన నగర మందుగాని, ఉండు స్థానిక కాలము ఆ దేశముయొక్క ప్రామాణిక కాలము (standard time) అని వ్యవహ రింప బడును. తూర్పు పడమరలకు అధికముగా వ్యాపించి యున్న అమెరికా సంయుక్త రాష్ట్రములవంటి దేశము అందు స్వన్వ ప్రామాణిక కాలములుగల అనేక కాల మండలములు కలవు. తూర్పునందు లేక పడమరయందు గల 180° యామ్యోత్తరరేఖ అంతర్జాతీయ దిన రేఖ యన ' ఐడును. ఈ రేఖ అధిగమించు ద్వీపములయొక్క తూర్పు పడమరలను ఇది ఆవరించి యుండును. ఒక దేశము ఈ రేఖను తూర్పుగా గాని, పశ్చిమముగా గాని అతిక్రమించి ఆయుండుటను బట్టి శ్యాలండరు (calendar) లోని తేదులు మారుచుండును. దీనికి పడమరగా అతిక్రమించినచో ఒక రోజు హెచ్చును. తూర్పుగా అతిక్రమించినచో ఒకరోజు తగ్గును. భూమియొక్త పరిభ్రమణము (Revolution) : భూగ్ర హము సూర్యుని చుట్టు 3285 దినములలో ఒక ప్రద శ్రీణము చేయును. అడముయొక్క వంపు సంవత్సరము నందు అంతటను ఒకే రీతిగా నుండును. తనచుట్టు తాను తిరుగుటవలనను (Rotation), పరిక్రమణముల (Revolutions) వలనను, రేయింబవళ్ళ కాలపరిమితులలో మార్పులు, సూర్యకిరణ వ్యాప్తియందలి మార్పులు, ఋతు భేరములు కలుగును. మార్చి 21, సెప్టెంబరు 22 తేదులలో సూర్యుడు నిరక్షరేఖమీద నుండుటచే, ధ్రువ ములయొక్క & (horizon) మందుండును. అపుడు సూర్యకిరణములు నిరక్షరేఖవద్ద నిట్టనిలువుగా (perpendicular)గా నుండుచు దక్షిణోత్తరములందు సదృశ మైన సమాంతర రేఖలమీద ఒకే విధమగు వంపుతో ప్రసరించుచుండును. కావున రేయింబవళ్ళు సమాన పరిమితి కలిగియుండును. మార్చి, 21 నుండి జూన్ 21 వరకు సూర్యుని యొక్క అంబ కిరణములు (vertical rays) కర్కటక రేఖ వైపునకు జరుగుచుండును. తరు

251