Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గడియారములు

సంగ్రహ ఆంధ్ర

నట్లు కరీంద్రముచే సేన భాసిల్లును. అట్టి సేనచే రాజు శోభిల్లును. అట్టి సర్వలక్షణసంపన్నుడగు ప్రభువువలన ప్రజలు సుఖింతురు.

చె. రం.


గడియారములు :

ఆధునిక యుగములో మానవునకు గడియారము అత్యవసరమైన యంత్రసాధనముగ పరిగణింపబడుచున్నది. సామాన్యుడైన సేవకుని నుండి అత్యున్నత స్థానమలంకరించు అధికారివరకు దైనందిన కార్యకలాపములను నిర్వహించుకొనుటకు గడియారము అత్యావశ్యకమైన సాధనముగా ఉపయోగపడు చున్నది. ఒక్కమాటలో చెప్పవలెనన్న, కాలమునకు అమూల్యమగు విలువ గలిగిన ఈ యాంత్రిక నాగరిక యుగములో గడియారము లేకున్నచో, అయోమయావస్థలో నున్నట్లు ఆందోళన చెందెడువారు పెక్కురు గలరు.

మన మీనాడు చూచుచున్న గడియారము పదునెనిమిదవ శతాబ్దానంతరమే ఈ రూపములో పరిణామము చెంది, యంత్రసహాయముచే కోటానకోటులుగా తయారు చేయబడి విపణివీథు లందు విక్రయింప బడుచున్నవి. అయితే కాలమును దెలుపు పరికరము యాంత్రిక యుగావతరణమునకు పూర్వమే పెక్కు దేశములందు విచిత్రరూపములలో అవతరించినది. కాలము గడచిన కొలదియు, మానవుని సృజనాత్మక శక్తివలన, పరిశోధనా పాటవము వలన, అవిరామకృషి వలన ఈ యుపకరణము నేటి రూపమున పరిణతి చెందినది.

వేర్వేరు దేశములందు, వేర్వేరు కాలములలో, వేర్వేరు రూపములలో గడియారము ఎట్లు కనుగొనబడి, క్రమముగ ఎట్లు మార్పులు చెందెనో వివరింతము. భారతదేశ మందేకాక, ఇతర ప్రాక్పశ్చిమ దేశములందును జనులు పగటివేళల సూర్యబింబము యొక్క సహాయముతోడను, రాత్రివేళల నక్షత్రములయొక్క చలనసహాయముతోడను కాలగమనమును గుణించి నిర్ణయించెడివారు. సూర్యబింబము ప్రకాశించునపుడు, ఎనిమిది పలకలు కలిగి, అంకెలు, ఇతర సాంకేతిక చిహ్నములచే గురుతు వేయబడిన ఒక కఱ్ఱయొక్క నీడను కొలిచి, కాలనిర్ణయమును చేసెడి విధానము గూడ ఆ కాలమందుండెడిది. ఇప్పటికిని కొందరు గ్రామీణులు ఈ ప్రాత పద్ధతినే పాటించు చున్నారు.

ఈ సాధనముకంటె ఎక్కువ హంగులతో, ముఖాకృతి (dial) కలిగిన మేలురకపు మరియొక సాధనము బాబిలోనియాలో తరువాత కనుగొనబడి గ్రీసుదేశమునకు కొనిపోబడినట్లు తెలియుచున్నది. గ్రీకు ప్రజలు బాబిలోనియానుండి ఎన్ని యో విజ్ఞానశాస్త్ర రహస్యములను నేర్చిరి. కాలమును గంటలలోనికి విభజించు విధానమును ప్రప్రథముగ బాబిలోనియా శాస్త్రవేత్తలు గ్రీకులకు నేర్పిరి. తరువాత గ్రీకులనుండి ఇతర యూరపియను దేశీయు లభ్యసించిరి.

చిత్రము - 77

పటము - 1

సూర్యకాంతివల్ల టైం తెలుసుకొనే 'సన్‌డయల్‌' గడియారము

పైన జెప్పబడిన గడియారమునకు ముళ్లుండెడివి కావు. దానిని 'సన్‌డయల్ గడియారము' అని పిలిచెడివారు. దీని డయల్‌కు వెనుక ప్రక్క ముక్కోణాకారముగల ఇనుపపళ్ళె మొకటి అమర్పబడి, దాని అంచుల పొడవునా గంటలను సూచించు రోమన్ అంకెలు వ్రాయబడియుండెడివి. నూర్యబింబము ఆకాశమందు పైపైకి పయనించినకొలదియు ఇనుప పళ్లెముయొక్క నీడ ముళ్ల వలె కదలి కాలమును జూపెడిది. సూర్య బింబముయొక్క గమనమును, నక్షత్రములయొక్క చలనమునుబట్టి కాలమును గుణించుట కంటె, ఈ సన్‌డయల్ గడియారమువలన మరింత తేలికగా, కచ్చితముగా కాలనిర్ణయము చేయగలిగెడివారు. ఇట్టి గడియారముయొక్క చిత్రములు చెక్కిన మైలురాళ్ళు రష్యాదేశములో పలుతావులందు కనిపించు చున్నవి.

2500 సంవత్సరముల క్రిందట బాబిలోనియాలో నీటి గడియారముల సాయముచే కాలమానము లెక్క కట్టబడినట్లు చరిత్ర వలన తెలియుచున్నది. ఇది మిక్కిలి శ్రమతో కూడుకొన్న విధానము. ఈ గడియారము సూర్యుడు

236