విజ్ఞానకోశము - 3
క్షేత్రపాయనము - మురుగుపారుదల
అడ్డముగను రెండుఅడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతుగల కాలువలను త్రవ్వెదరు. ఈ కాలువలలోనికి
వదలబడిన నీరు నిలువయుండి, పై యెత్తున నుండు మడులను క్రమముగా తడుపును.
5. బేసిన్ ఇర్రిగేషన్ : పండ్ల తోటలలో వృక్షముల చుట్టును వలయాకారములో పాదులను తయారుచేసి, కాలువల మూలమున వాటిలోనికి నీరును ప్రవేశపెట్టెదరు. తోటనంతయు జలమయము చేయరు. తరచుగా నీరు అవసరమైన లేదోటల పెంపకమునకు ఈవిధానము ముఖ్యముగా ఉపయోగపడును.
భూమి అడుగుభాగమునుండి నీటి పారుదల: ఈ నీటి పారుదల విధానములో భూమియొక్క ఉపరితలము నుండి ఒక అడుగు లోతున 3 - 5 అడుగులకు ఒక్కొక్కటి చొప్పున 'పోరస్ ' (సూక్ష్మమైన రంధ్రములుగల) గొట్టములను సమాంతరము (Parallel) గా అమర్చెదరు. జలాశయము నుండి ఏర్పాటు చేయబడిన ముఖ్యమగు గొట్టములకు ఈ చిన్న గొట్టములు కలుపబడును. ఈ కలుపబడిన చోట్లు (joints) అతికించబడవు. ఈ గొట్టముల ద్వారా స్రవించు జలము మొక్కల యొక్క మూలమునకు చేరుకొనును. ఈ విధానము వలన నీరు ఎంతో పొదుపగును. కాని ఇది ఎంతో వ్యయముతో కూడిన విధానమగుటచే సామాన్యమైన పేదరైతులు ఈ పద్ధతిని అనుసరింప లేరు.
ఊర్ధ్వభాగము నుండి నీటి పారుదల: ఈ పద్ధతి ననుసరించి గుండ్రముగా పరిభ్రమించు రంధ్రములుగల గొట్టములు భూమికి ఎత్తుగా పై భాగమున అమర్చబడి యుండును. ఒత్తిడి ఫలితముగా నీరు ఈ గొట్టములద్వారా సరఫరా చేయబడును. నీటియొక్క త్వరిత గమనము వలన, పై పేర్కొనబడిన రంధ్ర భాగములు గుండ్రముగా తిరుగుచు పైరుమీద సన్నని వర్షపు జల్లువలె నీటిని వదలును. ఒక్కొకప్పుడు రంధ్రములు గలిగిన ఈ గొట్టములు వరుసగా పాతబడిన స్తంభముల ఆధారముతో 30 నుండి 40 అడుగుల దూరమున నిర్మింపబడును. తీవ్రమైన ఒత్తిడితో నీటిని సరఫరా చేయుటవలన, గొట్టముల మూలముగా నీరు వర్షపు జల్లువలె పైరుమీద పడును. ఈ విధానము చాల వ్యయశీలమైనట్టిది. దీనివలన పంట పొలముచే అత్యధిక పరిమాణములో నీరు ఉపయోగింప బడును. కాఫీ, పుగాకు, కూరగాయల తోటలకు ఈపద్ధతి వలన అధిక ప్రయోజనము కలుగును.
మురుగు పారుదల : ఎందుకును పనికిరాని నీటిని వెలుపలికి పంపివేసి, ఆ నీటి సహాయముతో కొన్ని రకములైన పంటలను పండించుటయే ఈ మురుగునీటి పారుదల విధానముయొక్క ముఖ్యోద్దేశము. కొన్ని రకములైన పంటలు పండుటకు అవసరమైన ఆహార పదార్థములు ఈ మురుగునీటి యందు లభించగలవు. మురుగునీటి పారుదలకు ఇసుక, గులకరాయితో కూడుకొన్న భూములు ఎక్కువ అనువుగా నుండును. ఇట్టి నేలలందు నీరు వెంటనే సులభముగా ఇంకిపోవును. బంకమట్టి భూములు మురుగునీటి పారుదలకు పనికిరావు. కొంతవరకు నీటిపారుదల జరిగిన పిదప జంతువృక్ష సంబంధమగు తుక్కుపదార్థముతో బంకమట్టిలోని రంధ్రములు పూడిపోయి నీరు ఇంకదు. కనుక పైరుల పెరుగుదల నిలచపోవును.
నీటి పారుదలను సమర్థవంతముగా, పొదుపుగా నిర్వహించుట : నీటిపారుదల విధానమును సమర్థవంతముగను పొదుపుగను నిర్వహించుటకు ఈ క్రింది చర్యలను అవలంబించవలెను :
1. భూమి ఉపరితలమును, సహజ సిద్ధముగా నున్న ఏటవాలు ననుసరించి మెత్తగా, చదునుగా తయారు
చేయవలెను.
2. భూమి స్వభావమునకు తగినట్లుగా పండింపదలచుకొన్న పైరులకు అనువగునట్లు నీటిపారుదల విధానమును
నిర్ణయించవలెను.
3. నేలను కోత కోయకుండా, పైరుకు చాలినంత నీటిని పుష్కలముగా సరఫరా చేయునట్లు కాలువల త్రవ్వకమును ఏర్పాటు చేయవలెను.
4. భూమిని లోతుగా, చక్కగా దున్నవలెను. నీరు భూమిలోనికి పూర్తిగా చొచ్చుకొని పోవునట్లు మట్టిగడ్డలను మెత్తగా చితుకగొట్ట వలెను.
5. భూమిని తరచుగా దున్నుచు, కలుపును నిర్మూలము చేయుచుండవలెను. పైరుమీద పరిశుభ్రమైన గాలి
వీచునట్లు ఏర్పాటు చేయవలెను.
147