Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోషీ - ఏ. ఎల్.

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 24

పటము-3

కోలారు బంగారుగనిలో బంగారమును కరగించుట

-Courtesy : Director of Publicity and Information Govt. of Mysore.

చిత్రము-25

పటము - 4

కోలారు బంగారుగనిలో క్రియాకలాపము

-Courtesy : Director of Publicity and Information Govt. of Mysore.

పేట, ఛాంపియన్ రీఫ్ ప్రాంతములలో బంగారు గను లున్నవి. భారతదేశములో దొరకు బంగారములో అత్యధిక భాగము ఇక్కడిదే. ఇటీవల కేంద్రప్రభుత్వము వారు చేసిన భూగర్భశాస్త్ర పరిశోధనమునుబట్టి ఇంకా ఎక్కువ బంగారము లభించుగనులు ఈ పరిసరములలో ఏర్పడ గల వని అంచనా వేయబడినది.

ఇక్కడ ఒక కళాశాలయు, రెండు పురోన్నత పాఠశాలలును, ఒక పాలీటెక్నిక్ కళాశాలయు గలవు.

కె. సు. రా.


కోషీ - ఏ. ఎల్. :

కోషీ ఆగస్టిన్ లూయీ (1789–1857) ప్రఖ్యాతు లయిన ఫ్రెంచి గణితశాస్త్రజ్ఞులలో నొకడు. ఇతడు ప్యారిస్ నగరములో 1789 సం. ఆగష్టు 21 తేదీయందు పుట్టి, సియాక్సునగరము(సీన్)లో 1857 వ సం. మే నెల 23 వ తేదీయందు మరణించెను. ఇతడు స్థాపత్య శాస్త్రము (Engineering) ను అభ్యసించెను. కొంతకాలము ఇంజనీరుగాగూడ పనిచేసెను. 1813 లో ఇతని ఆరోగ్యము చెడిపోయెను. అప్పటినుండి శాస్త్రాధ్యయన వ్యగ్రుడయ్యెను. 1816 నుండి ప్యారిస్ నగరమున మూడు శాస్త్రములలో ఆచార్యస్థాన మలంకరించెను. కాని 1830 సం . రమున ఘటిల్లిన ఫ్రెంచి

116