Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కోయలు

గోత్రము, 4. మూడుగుట్ట గోత్రము, 5. పరడిగుట్ట గోత్రము అని ఐదు తరగతులుగా విభజింపబడి యున్నారు. కోయలయొక్క సాంఘికవ్యవస్థ విశదముగా నిర్వచింపబడి యుండలేదు. వారు సాధారణముగా సవర్ణహిందువులు గానే పరిగణింప బడుచున్నారు.

వ్యవసాయము, అడవిలోని యితర పనులు-వారియొక్క ముఖ్య వృత్తులు. ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశమునకు మార్చబడు 'పోడు' అను వ్యవసాయ పద్ధతి కొన్ని పల్లెలలో ఇప్పటికిని ఆచరణమందున్నది. హైద్రాబాదు రాష్ట్రములోని ఆదిమ నివాసులైన జాతులలో చెప్పుకొనదగినంతగా పరిశ్రమలలో నియుక్తులైన వారి గుంపు ఈ కోయగుంపు మాత్రమే. వారు కొత్తగూడెము, సింగరేణి ప్రదేశములలో పనిచేయుచున్నారు. వారు ముఠాకట్టి సమష్టిగా పనిచేయుటలో కడు సమర్థులనియు, సమష్టి కృషితో

చిత్రము - 20

కోయలు అడవిదున్నలకొమ్ములతో కూడిన శిరోలంకారములను ధరించి, పెండ్లి పండుగలందు దున్నలయుద్ధమును అనుకరించు నాట్యప్రదర్శనము.

చిత్రము - 21

సింగారించుకొన్న కోయ యువతులు

యాంత్రికమైన కార్యకలాపములు నిర్వహించుటయందు కూడ మిక్కిలి నేర్పరులనియు అందురు. అడవివస్తువులను గూడ వీరు పోగు చేయుదురు. కొందరు వెదురుతో తట్టలల్లుట, తుంగతో చాపలల్లుట మొదలగు పనులు చేయుదురు. వీరుమిక్కిలి పేదవారు, త్రాగు బోతులు.

కోయలు వివాహ విషయములో మత ప్రాముఖ్యమును, పురాణగాథల ప్రాముఖ్యమును కల్పించుచుందురు. కాని ప్రతియొక కర్మకువారికి కారణము తెలియదు. లేచిపోవుట (elopement) మొదలగు అన్ని విధములైన వివాహ విధానములును జరుగుచున్నవి.

109