పుట:SamskrutaNayamulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

సంస్కృతన్యాయములు

పూర్ణఘటన్యాయము
  • నిండుకుండ తొణకదు.
పూర్ణాహ్ణన్యాయము
  • పూర్ణాహ్ణమందు మనుష్యుని నీడ దీర్ఘమయి క్రమక్రమముగ తగ్గిపోవును.
  • (దీనిని ' పూర్వాహ్ణచ్ఛాయాన్యాయ ' మనియు నందురు.)
పూర్వాత్పరబలీయస్త్వన్యాయము
  • మొదటి దానికంటె రెండవది బలవత్తరము.
పృథివ్యోషధిన్యాయము
  • పృథివియందే ఓషధు లిమిడియున్నట్లు.
  • ఎంతలోతైనను త్రవ్వుడు. విత్తనములు వేయునవసరము లేకయే అచట మొలక బయలుదేరును.
పృష్టాకోటిన్యాయము
  • సర్వజ్ఞుఁడు కాకపోయినా అడిగినదానికి వలసినంతవఱకు సమాధానము చెప్పినఁ జాలును.
పృష్ఠఖలీన్యాయము
  • మూతికిఁబెట్టు కళ్ళెము ముడ్డికిఁ బెట్టినట్లు.
ప్రతిబింబన్యాయము
  • వస్తువు కదలిన దానినీడయుఁ గదలునట్లు.