పుట:SamskrutaNayamulu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
339

సంస్కృతన్యాయములు

యాత్రార్ధా వగతి రేవ నాస్తి తత్ర్ సన్ధేహస్య కాకథా?

అసలు అర్ధమే స్పురించని తావున సందేహవిషయమును గూర్చి చెప్పూనదేమున్నది?

హత్ప్రాయో యచ్చ యాదృక్చత తాదృ గనగమ్యతే

సాధారణముగ నేది ఎట్లు కనుపించునో అది అట్లే తెలిసి కొనబడును.

యధా దేవ స్తధా భక్త:

దేవు డెట్టివాడో భక్తు డాట్టివాడే అవును.

యధా నామ తధా గుణ:

పేరుకు తగినట్లే గుణముకూడా.

యధాపితా తధాపుత్త్ర:

"ఆత్మావై ;పుత్త్రనామా పి" కావున తండ్రివంటివాడే పుత్రుడు నవును.

యధా బీజ స్తధాజ్కర:

విత్తమువంటిదే అంకురము.

"న హి శ్యామాకబీజం పరికర్మసహస్రేణాపి కలమాం కురాయ కల్పతే" అను న్యాయముమాదిరి:


యధా భావ స్తధా దేవ:

భావ మెటు లున్న దేవుడు నట్టిరూపముగలవాడే అవును.