పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందఱు నన్నివిధముల వేధించుకొని తినుచుండుదురు. దేహిని మృత్యువు బెదరించునట్లు, రాజు, జలము, నగ్ని, స్వజనులు ధనికు నెల్లపుడును బాధించుచుందురు. ధన సంపాదనమే కష్టము. ఆర్జించిన దానిం గాపాడుకొనుట మఱియు గష్టము. దానికి హాని గలిగెనా మృత్యుబాధ గలుగును. కావున దానిపై నాశవీడుట మేలు. తృష్ణ ప్రసరించినవాని శిరముపై దాస్యము తాండవించుచుండును. అది వీడిననాడు ధనికుడనియు, దరిద్రుడనియు భేదభావము గలుగదు. నెఱవేఱుచున్న కొలదియు గోరికల కంతమే యుండదు. కావున నిచ్చట నుండి కాలము గడపుము." ఈవిధముగా బలికిన మంథరుని మాటలు విని లఘుపతనకు డిట్లెనెను.

"మంథరా! ధన్యుడ నైతిని. నీగుణములు కొనియాడ దగినవి. బురదలో దిగబడిన యేనుగులను లేవనెత్తుట కేనుగులే సమర్థము లయినట్లు సత్పురుషుల కాపద గలిగినపుడు సన్మిత్రులే దానిని దొలగింపగలరు. మహాత్ముల స్నేహము లామరణాంతములు: కోపములు క్షణికములు; త్యాగములు జంకులేనివి. యాచకుని, శరణాగతుని, నెవరు నిరాశతో వెడలింపరో వారే సకలగుణములకు నాలవాల మగుదురు."

చిత్రాంగుని చేరిక

అనంతరము మంథరాదులు మువ్వురును హాయిగా గాలక్షేపము సేయుచుండిరి. ఇట్లుండగా నొకనాడు చిత్రాంగు