పుట:Sameeksha, 1937.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రణయ కీర్తనము * *

కవికులతిలకమగు కాళిదాసుని కృతులు శృంగారరస ప్రధానములు. శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య, భయానక, బీభత్స, రౌద్ర, శాంతములనెడు నవరసములలో శృంగారము ప్రథమమే కాక, ప్రధానము కూడ నగుటచే ఆలంకారికులు దీనిని ఆదిమరసమని ప్రశంసించిరి. వైష్ణవభక్తులు నిరూపించు శాంత దాస్య సఖ్య వాత్సల్య మధురములనెడు పంచభావములలో మధురభావము రసశిరోమణిగ పరిగణింపబడుచున్నది. శృంగారరసమునకును మధురభావమునకును స్థాయిభావము రతియగుటచే నీరెండును ఒకటియేయని తెలియనగును. పరస్పరరూపలావణ్యములం దుద్భవించి, స్వప్నచిత్రసాక్షాద్దర్శనములచే దృప్తినొందక, ప్రత్యంగప్రాప్తికై నిత్యనూతన రూపములం దాల్చుచు, ఒకప్పుడు శిరీషముకంటెను కోమలమై, ఇంకొకప్పుడు నజముకంటెను కఠోరమై, హర్షము, విషాదము, ధైర్యము, గర్వము, కార్పణ్యము, శోధము, క్షమ, దురభిమానము, నిర్వేదము మొదలగు వికారములనొందుచు, ఏకనిష్ఠ, సంగలిప్స, ఆత్మప్రసన్నత్వము, కారుణ్యము, ఏకాత్మత, మొదలగు భావముల కావాసమై జరామరణశూన్యమై స్థిరసౌదామినింబోలె విరాజిల్లు నాయికానాయకుల యీ ప్రేమలీలావిలాసము ఎల్లదేశములలోను ప్రణయ కీర్తనము