పుట:SamardaRamadasu.djvu/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శౌర్యసాహసములు గల పరాక్రమవంతు లగు గుంపులను దీసికొనివచ్చి శివాజీచుట్టు జేర్చెను. సామాన్య పురుషులయొక్కయు, స్త్రీలయొక్కయు హృదయములుకూడ శౌర్యోత్సాహములతో నిండి తటటట గొట్టుకొనెను. శివాజీ తలపెట్తిన యీమహాకార్యమునకు దన సర్వస్వము ధారపోయుట యుక్త మని ప్రతి మనుష్యుడు తలంచెను. శివాజీ యొక్క రణ దుందుభి మ్రోగినతోడనే ప్రతిమనుష్యుని హృదయమందును దేశాభిమాన మను మహాగ్ని ప్రజ్వలింపజొచ్చెను. కొన్ని సంవత్సరములలోనే మహారాష్ట్రు డను శబ్దము విదేశకులకు గర్భనిర్భేదక మయ్యెను.

1674 సం.న శివాజీ శాస్త్రయుక్తముగ బట్టాభిషేకము చేసికొనెను. అతని బిరుదు "గోబ్రాహ్మణ పరిపాలక ఛత్రపతి శివాజి మహారాజ్" అని యుండెను. చిరకాలము తనహృదయమున నెలకొని యుండిన తన కోరిక ఫలించుటచే రామదాసుని యొక్క యానంద మెంతో మనమూహించు కొనవచ్చును. రామదాసు ముందుగ బవిత్రస్నానము చేసెను. శివాజీ సింహాసన మెక్కక మునుపు రామదాసునకు రాజాలంకారము చేసిరి. అతని తల మీద రాజలాంఛన మైన శ్వేతచ్ఛత్రమునుబట్టిరి. ఆయన మొట్టమొదట సింహాసన మెక్కెను. పిదప గద్దె శివాజీ యెక్కెను. తాను సింహాసన మెక్కుటకు రామదాసు చేసిన ప్రయత్న మంతకు శివాజీ తన కృతజ్ఞత నెట్లు తెలుపుకొనెనో దీనివలన మనము గ్రహింపవచ్చును. అప్పుడు రామదాసు యొక్క యాజ్ఞప్రకారమే శివాజీ రాజ్యమును స్వీకరించి యభిషేకము జేసికొని గద్దె నెక్కెను.

ఒకానొకనాడు రామదాసుడు హఠాత్తుగా రాయఘడ్ కోటకు బోయి శివాజీని దర్శించెను. అప్పుడు శివాజీ తన రాజ్యమంతయు గురుదక్షిణగ రామదాసున కర్పించెను. గురుశిష్యు లిద్దఱును మహాశ్చర్య నిమగ్నులై యొకరివంకనొకరు చూడ నారంభించిరి. గురువు శిష్యునియొక్క స్వార్థత్యాగమునకు నక్కజపడి నిశ్చేష్టు డయ్యెను. శివాజీ గురువుగారి నోటనుండి యే యాజ్ఞవెడలునో యని యెదురు చూచుచు నిలువబడెను. శివాజీయొక్క మనస్సు రాజ్యతంత్ర నిమగ్నమయ్యు నెంత