డయ్యెను. శివాజీ చాఫల్ మఠములో నొక వారము దినము లుండి యాదినములలో రామదాసుని శిష్యులలో ననేకులకు బట్టాలనిచ్చి యాతనికార్యము తుద నెగ్గుటకు ధనసహాయముగూడ జేసెను. శివాజీ నిరంతరము రామదాసుని సన్నిధానమున నుండగోరెను. కాని రామదాసు దానికి గట్టిగ నిరాకరించెను. "నేను సన్యాసిని గావున నేనెల్లప్పుడు వనములలో నుందును. నీవు నాతో నుండగూడదు. నీవు క్షత్రియుడవై పుట్టినందులకు దేశపరిపాలన చేసి ధర్మము కాపాడవలెను" అని యతడు బదులుచెప్పెను. ఉపదేశము నాటికి శివాజీ వయస్సిరువది రెండు సంవత్సరములు. అది మొదలుకొని శివాజీ ప్రతివారము రామదాసుని దర్శనము చేయుచు వెనుకటివారమున జరిగిన సంగతుల నన్నియు వానికి జెప్పుచు ముందువారము జరుపవలసిన కార్యములగుఱించి యతని నాలోచన లడుగజొచ్చెను. కాలక్రమమున శివాజీ యొక్క రాజకీయ వ్యవహారములు మితిమీఱిపోయినందున మునుపటివలె నతడు ప్రతివారము గురుదర్శనము చేయలేకపోయెను. తఱచుగా రామదాసుని దర్శన భాగ్యము లభించుటకై రాయఘడ్ కోటకుగాని ప్రతాప్‌ఘడ్ కోటాకుగాని షాజ్జాన్ కోటకు గాని బస మార్పు మని శివాజీ రామదాసును వేడుకొనెను. అందుకు రామదా సిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. "శివబాబా, నేను వనసంచారిని. నా కీ చోటు, ఆ చోటు అన్న మాటలేదు. అటువంటివాడను నేను స్థిరముగా నొక చోట నెట్లుండగలను? అదిగాక నీవు రాజువు. సముద్రమును, నిప్పును, రాజును నమ్మగూడ దని శాస్త్రములు చెప్పు చున్నవి. మా వంటివారికి రాజసహవాస మెన్నడు క్షేమకరముగాదు. నా ప్రస్తుతస్థితి నాకు సుఖకరముగానే యున్నది. నాక్షేమము విషయమై నీకుగల శ్రద్ధకు జాల సంతోషించుచున్నాను. నిరంతర సహవాసము మన కనవసరము." ఈమాటలు శివాజీ హృదయమున వ్రణముగా నాటెను. అందుచే నతడు విచారమగ్ను డయ్యెను. ఈ విచార మతని రాజ్యాంగ విషయములను గొంత పాడుచేయునేమో యని సందేహము కలిగెను. ఆ మాటలు విని రామదాసుడు తాను పరాలీకోటలో నుండ నిశ్చయించితినని శివాజీకి వర్తమాన మంపెను. వెంటనే శివాజీ పరాలీవద్ద గొప్ప
పుట:SamardaRamadasu.djvu/64
స్వరూపం