పుట:SakalathatvaDharpanamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
7. ప్రణవసౌజ్నానవవిధము.

అక్షరత్రయాత్మకంబును, నాదబిందుకళాత్మకంబును, సృష్టిస్థితిలయకారణంబును, గుణత్రయాత్మకంబును, త్రిమూర్త్యాత్మకంబును, శరీరత్రయాత్మకంబును, ఈశ్వరత్రయాత్మకంబును, మంత్రత్రయాత్మకంబును, శక్తిత్రయాత్మకంబును యీ9న్ని ప్రణవసౌజ్నానవవిధ మనంబడును.

ఈ ప్రణవము యొక్క నవవిధములలోనే ప్రపంచ మంతయు నంతర్భూతమని తెలియుటే యీ విచారమునకు ఫలము.

దశసంఖ్యా ప్రకరణము.

1. దశేంద్రియములు.

శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వా, ఘ్రాణము, వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్త యీ10న్ని దశవిధేంద్రియము లనంబడును.

2. దశవాయువులు.

ప్రాణవాయువు, అపానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు, నాగవాయువు, కూర్మవాయువు, కృకరవాయువు, దేవదత్తవాయువు, ధనంజయవాయువు యీ10న్ని దశవాయువులు.