పుట:SakalathatvaDharpanamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవసంఖ్యా ప్రకరణము.

1. నవవిధ సంస్కారములు.

జ్నాత్రు, జ్నాన, జ్నేయము, కర్మ, కర్తృ, క్రియలు, భోక్తృ, భోజ్య, భోగము యీ9న్ని నవవిధసంస్కారము లనబడును.

2. పక్షాంతర నవవిధ సంస్కారములు.

ప్రాణపంచకము, జ్నానేంద్రియపంచకము, కర్మేంద్రియపంచకము, భూతపంచకము, అంతఃకరణచతుష్టయము, స్థూలశరీరము, త్రివిధకర్మలు, అవస్థాత్రయము, వీనికి కారణమైన అజ్నానంబునుం గూడి నవవిధసంస్కారము లనంబడు. దీనికే నవవిధప్రపంచమనియు పేరు.

యీ నవవిధ సంస్కారములు అహంకారంబునకే కాని, ఆత్మకు లేవని తెలియుటే యీ విచారమునకు ఫలము.

3. నవవిధ సర్గములు.