పుట:Sahityabashagate022780mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

సప్పటికీ దివ్య చేతన అతనియందు కన్న ఇంతో అంతో అధికంగా ఉందనుట వాస్తవము. అట్టివాడు జగత్సత్యాన్ని తాను సందర్శించ గలిగినట్లు లోకం వారినాపానిందలకు లోగడ ప్రవచించడం ముఖ్యధర్మం. ఆధర్మాన్ని నెరవేర్చక తన యందలి దివ్యచేతనను దమింపచేసుకొని, అణచిపెట్టుకొని లోకము మెప్పుదంనో లేక ధనాది లాభమునో కోరి లోకముయొక్క ప్రీతికై సత్యాన్ని అన్యదా ప్రకటించడం ఆత్మవంచన, మరపంచన కాక మరేమవుతుంది. 'హితంమనోహారి చ దుర్లభంణ్ వచ: ' అన్నట్లు, హితమైనది ప్రియమైనది అయిన వాక్యము దుర్లభము - లోకమునకు హితమైనది, లోకంచెవికి ఇంపైనది ఒకటి కాకపోవచ్చును. అప్పుడు నిజమైన కవి కర్తవ్యమేమి. నలుగురూ ఏది మెచ్చుకుంటారో, దేనికి ప్రియపడతారో అట్టి మొరమెచ్చు అసత్యమునో అర్ధసత్యమునో చెప్పోడమా లేక లోకముయొక్క క్షణిక ఆగ్రహమునకు వెరవక పూర్ణ సత్యాన్నే చెప్పడమా అనేది మహాకవి తనకు తాను నిర్ణయించుకోవలసిన పరధర్మము, ఎవడు ప్రజాభ్యుదయము పేర, మూకజనానీకమునకు తాత్కాలికా మోదం కలిగించే భాషణం చేస్తాడో అతడు తనకున్నూ లోకానికిన్నీ అన్యాయమే చేస్తున్నాడు. కావ్యము ప్రజల కందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కవిత్వ, భాషను పలచబరచి, క్రిందికి దిగలాగి హీనవ్యవహార భాషాగతికి దింపే రచయిత లోకానికి మేలు చేస్తున్నాడనడానికి వీలులేదు. ఆధునికుల్లో కొందరు ఇటువంటి అపసిద్దాంతాలకు గురి అవుతున్నారు. అసలు కావ్యప్రయోజనమేమిటి, పాఠకుణ్ణి భౌతిక శ్రేణినుండి సుకుమారంగా రసశ్రేణికి అధ్యాత్మిక శ్రేణికి క్రమోన్నతంగా తీసుకొని పోవడమేకదా, ఇట్టి ఆరోహణయాత్రకు స్వచ్చమైన నిర్మలమైన భాష ఉత్తమసాధనము. అది గ్రామ్యదూషితము కాకూడదు. ఆగ్రామ్యతా లక్షణ విలసితమైయుండాలి. ఇట్లా అనడంచేత మేము గ్రామ్యగామ్య చర్చలోనికి పాఠకుని దింపాలని భావించడంలేదు. అక్కడ గ్రామ్య మనగా అసభ్యమైనది, వింద్యమైనది, కటువైనది అనియే మాతాత్పర్యము. అందుచేత ప్రజాహితము అనే ఆభాసకారణంతో సాహిత్య భాషను అసంస్కృత నిత్య వ్యవహారంలోకి దింపడం కూడా వాంచనీయము కాదన్న మాట.

     ఇంక ఉభయవాదులని మనము చెప్పుకొన్నవారు, వీరి ఉభయనిష్ఠత త్వము ఎక్కడంటే ఆత్మ ధర్మాన్ని వీడకుండా పరహితైక దృష్ఠితో సత్యప్రవచనం చెయ్యడంలో ఉంటుంది.  ఇక్కడ సత్యమనగా సాహిత్య సత్యము. వస్తుతత్వ దర్శనము.  ఉభయ వాది కవులు ఇదివరలో మనము చెప్పుకొన్న సాత్విక శ్రేణికి చెందిన కవులు.  తాము లోక హితంకోసమే కావ్యారంభ ప్రవృత్తులైనట్లు వీరు లీలగా సూచిస్తూఉంటారు.