పుట:Sahityabashagate022780mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేచ, ఊష మున్నగు కొన్ని శబ్దాలు ప్రాచీన వేదభాషలో ఉండేవి, భౌకిక సంస్కృతంలో జారిపోయాయి., అందుచేత వీటిని అప్రయక్త శబ్దములు అన్నారు. ఇటువంటి అపయుక్త శబ్దాలు రసప్రధానమైన కవిత్వంలో ప్రయోగార్హాలు కావు. వాటి అర్ధం సులభంగా తెలియదు తత్షణ రసస్పూర్తికి అవి విలంబ కారణములు అవుతాయి. శాస్త్ర విదులు, పండుతులు తమ శాస్త్ర ప్రయోజనాలకు వాటిని వాడితే వాడుదురుగాక అందరికీ సులభంగా అర్ధమయి రస్దచర్వణకు తోడ్పదే మృదుపదాలే వాడాలని ఈ సూత్ర పర్యవసానము. నన్నయభట్టు ఈ మాట ప్రత్యక్షంగాచెప్పకపోయినా ఆచరణలో పాటీంచారు. అందుచేతనే మృదు సులభసంస్కృత శబ్దాల్తో కవిత్వంకూర్చి తనకాలానికే కాక అన్నికాలాల వారికి మార్గదర్శకుడయ్యాడు. చింతామణి పేర్కొన్న పేరోషాదిక శబ్దాల పట్టికలో ఇంకా కొన్నింటిని చేర్చవలసి ఉంది. సంస్కృతంలో మల్లేనే తెలుగులో కూడా మిక్కిలి ప్రాచీనములయి సులభంగా అర్ధంకాని పదాఅను కూడా ఎల్లరకు తెలియవలసిన కవిత్వంలో పరిహరించాలి. ఱచ్చు, ఱస్సివంటి అప్రసిద్ద రూపాలు, సర్వబాదా సరియారువు (సర్వబాధా పరిహారముగా) వంటి వ్యాహారిక రూపాలు కూడా నన్నయ ఇందుకే అరిహరించి ఉంటాడు. ఈ కోటిలోకేవ్ వస్తాయి అన్య భాషాశబ్దాలు. ఇక్కడ అన్యభాషా శబ్దాలంటే తమిళ కన్నడ భాషాపదాలను వాడవచ్చును. కాని తెలుగువారందరూ చదివి ఆనందించవలసిన కవిత్వంలో ఇవి అర్ధావగతికి అవరోధంకలిగించి రసానందమునకు అంతరాయాలు అవుతాయి. కావున పరిహార్యములు, శివకవులు జానుతెనుగు అనే ఆదర్శంతో మారుమూల తెలుగు పదాలను, అన్యభాషా పదాలను కవిత్వంలో ప్రయోగించడంచేత వారి గ్రంధాలు సర్వజనాదరణను పొందలేక పోతున్నాయి. తిక్కన సోమయాజికూడా ఇటువంటి అప్రసిద్ధ పదాలను వాడడాన్ని నిరసించాడు. వాటిని ఆయన 'ప్రాతపడ్డమాటలు ' అన్నాడు. నిఘంటు మాత్రదృశ్యములైన సంస్కృత పదాలు కూడా ఈ శ్రేణిలోకే వస్తాయ్8ఇ. మాండలిక పదాలు ప్రధాన భాషాంతర్గతాలయినప్పటికీ అవి అప్రసిద్ధములైన వైతే అర్ధస్పురణకు విలంబు హేతువులే అవుతాయి. ఇన్నినిషేధాల్తో రచనచెయ్యడం సులభంకాదు. మహాకవి అప్రయత్న సిద్ధంగానే రసానుకూలమైన పదం ద్యోతక మవుతుంది.

   కావ్యభాషా నిర్మాణంలో నన్నయ కైకొన్న రెండవచర్య పదజాలాన్ని విస్తరింప చేసుకొవడము, భావపునరుక్తి మల్లేనే శబ్దపుసిరుక్తి  కూడా కవిత్వంలో రక్తికట్టనీయదు.  భావచమత్కృతి వలెనే శబ్ద వైవిద్యం ఉంటే రచన అందగిస్తుంది.  అదీగాక