పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

77 దివ్యప్రేమ

ములు - వారిని గౌరవించు నాచారము మన కుగ్గుపాలతో ఉపదేశింపబడును. గాంధారి తనభర్త అంధుడని యెరిగిన వెంటనే కళ్ళకు గుడ్డకట్టుకొని అంధీభూత అయ్యెను. సావిత్రి తండ్రియిచ్చిన భూషణాంబరాది రాజచిహ్నములవీడి నారచీరకట్టి గురువుల సేవించుతూ పత్యవసానదినమున యముని మెప్పించి పతిని పునర్జీవితు గావించుకొంది.

ఇట్టి సతీగౌరవమున గ్రాలుచున్న భారతవర్షమున సీత సర్వజనసమాదరణమునొంది ఎల్లకడల పూజింపబడుతూ ఉన్నది - ఒక్కసీత అననేల? పతివ్రతలందరూ ఆమెవలె పరమపూజనీయ లయినారు - సతి, పార్వతి, అరుంధతి, సావిత్రి, గాంధారి, చంద్రమతి, దమయంతి, మొదలుగా గల నారీమణుల పేర్లు విన్నతోడనే ప్రతిభారతీయుని శిరము గర్వముచే ఉన్నతమై, చిత్తమునకు శుద్ధియు, శీలమునకు పవిత్రతయు అలవడును.

ఏ పాతివ్రత్యగౌరవము ఆర్యసాహిత్యమున పురాణములయందు, కావ్యములందు, నాటకములందు, నవలలందును అవిరళముగా ప్రస్తుతింప బడెనో, ఏ పాతివ్రత్యబలము నాధారము చేసుకొని భారతరమణులు ధైర్యము, క్షాంతి, అధ్యవసాయము, కార్యచాతుర్యము, వైదగ్ధ్యము, సహిష్ణుత మొదలగు సుగుణముల నభ్యసించి నారీరత్నములని బరగు చున్నారో, ఏసతీధర్మాచరణమునవారు పవిత్రశీలలు, పూత చరితలు నగుచున్నారో, అట్టిపాతివ్రత్యధర్మగౌరవమును