పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 సాహిత్య మీమాంస

దుండునెడ ఆకారాగారమును ఆమె శ్రీరామమయ మొనర్చెను. రామనామస్మరణయే ఆమె కప్పుడు సంజీవి - రాక్షసకాంతల తర్జనభర్జనముల కోడి ఆమె మనసు ఏకాంతమున శ్రీరాముని శరణు జొచ్చింది. భయముచేత భక్తి పెరిగి పతి ప్రేమను పరిపుష్ట మొనర్చెను. అహోరాత్రములు శ్రీరాముని నీలమేఘశ్యామలమూర్తిని ధ్యానించుటచేత ఆమె పతి పరాయణత పరమావధి చేరెను. సరమతో ఎల్లప్పుడూ శ్రీరాముని చరితమునేవల్లెవేయుచుండు ఆమెకు వేరొక చింత యెట్లుండును? లంకా విజయానంతరము ఆమె పాతివ్రత్యము అగ్నిచే పరీక్షింపబడినది.

శ్రీరాముని అంకమునుండి విగళితయై లంకావాసము చేయునెడ తిరిగీ పతిసమ్మేళనమున దానిని పొందగల్గుదు నను ఆశచే ఆమె ప్రాణములు బిగబట్టెను, కాని లక్ష్మణుడామెను గంగా తీర కాననముల విడిచినప్పుడు ఆమెకిట్టి ఆశయెక్కడిది? ఐన నామెశ్రీరామునియందలి భక్తిని వదలలేదు, ఆతనిమేలు కోరడము మానలేదు. సహకారము నాశ్రయించిన మాధవీలతను తెంచి పారవేయు మాడ్కి ఆతడామెను వనభూములకు పారదోలెను. వాల్మీకి యాశ్రమము అశోకవనము వంటిది కాకున్నా ఆమె పాలిటికి అంతకన్న భయావహ మాయెను: రావణుని వశమున ఆమె యుండునపుడు వైర నిర్యాతన మొనర్చడమునకు శ్రీరాముడు తనచెర విడిపించి తీరుననే ఆశయుండెను, కాని యిప్పుడట్టి ఆశలేదు, కావున