పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72 సాహిత్య మీమాంస

రచించిన ఆదము అవ్వల ప్రేమచిత్రము ఈ రచనముం దేపాటి? పుట్టినదాది స్వర్గమందున్నవారికి భూలోకమందలి సుఖదు;ఖములూ, హింసాద్వేషములూ తెలియవు. వారు ఐహికజ్ఞాన రహితులు; అజ్ఞానాంధమసావిష్టులకు ప్రేమ రస తేజస్స్ఫురణము అసంభవము కాదా? కావున వారిప్రేమ ప్రేమకాదు, వారిసుఖము సుఖముకాదు. సీతారాముల ప్రేమకును వారి ప్రేమకును స్వర్గపాతాళముల కున్నంత అంతరముంది. సీత దు;ఖమయకాననమును ప్రేమసుఖమయ మగునట్లు చేయ, అవ్వ సుఖమయకాననమును వసించుటకు అహన్‌త గడించలేక అధోగతిని కూలత్రోయబడెను. పాపకలితమగు పృధ్వీఖండము సీత పుణ్యవంతమగా చేయ, పుణ్యవంతమగు స్వర్గమున అవ్వ పాపకంటకము నాటి హింసాద్వేషముల మొలిపించింది.

రాధాప్రేమ -

ఆర్యుల భక్తిశాస్త్రమున నింకోమాదిరి ప్రేమా దర్శము పొడచూపుచున్నది. మానవుల యందలి సాత్విక ప్రేమకది మూలప్రతిమ అనవచ్చును. ఆప్రేమ మూర్తీభవించి రాధారూపమును దాల్చింది, గోపికలామె సహచరులు; దంపతుల ప్రేమ చెందదగిన చరమసీమను మీరి రాధికాప్రేమ కృష్ణభక్తిగా మారెను, కావున దానిని ప్రేమభక్తి అననొప్పును, దంపతీప్రేమకు పరమావధి భగవదర్పణమే. భగవంతుడే జగమునకెల్ల నాధుడు. రాధయు గోపికలూ