పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62 సాహిత్య మీమాంస

నీరయితే, అట్టి పరీక్ష భయప్రదమై పై నుదహరించిన ఛురికా వ్యవహారము వలె బీభత్సావహముగ నుండి యుండును. భారతమున లక్షాగృహ దహనము లేదా అని యడుగవచ్చును. ఉంది, కాని అదిప్రహసన ప్రాయము - ఖాండావదహనముంది, కాని అది రాజ్యమున శాంతి నెలకొల్పుటకు నిర్మింప బడింది. ఇందేదీ నాటకమందు కానరాదు. శ్రవ్యకావ్యములలో నిట్టివుండుట దోషము కాదు. పుర్రాణేతిహాసములలో ఎన్నియో అద్భుత వ్యాపారములు కల్పింపబడియుండును. ఇది సాహిత్యమునకు లోపముకాదు. నాటకములయం దవి ఉండగూడదు.

నాటక పర్యవసానము -

ఆంగ్ల సాహిత్యమందలి హత్యాకాండము సమర్థింప బూని అవి స్వాభావికములని వాదించేవారు సీతాస్వర్గారోహణము అస్వాభావికమనియు అద్భుతమనియు ఎట్లువాదింతురో? వియోగాంత నాటకము లందలి గోరహత్యాకాండమును కన్నులార జూచి యూరకుండుట స్వాభావికమని అనలేము. మనుష్యులయందు పాపము స్వాభావికమే, కాని యిట్టి హత్యాకాండము ఎట్టిపాపశైలశిఖరమును కూడా ముంచును. హత్యకన్న నీచతరమును గహ్న్యము నగు పాప మింకొకటి కలదా? ఇట్టి అస్వాభావికవ్యాపారముల నాటకములలో జొన్పుటకు ఆవశ్యకత యేమి? నాటకకళాకౌశల మందమా? సీతాస్వర్గారోహణము, పాతాళ ప్రవేశము