పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52 సాహిత్య మీమాంస

ఇది రసస్ఫూర్తివిషయము; కవిత్వము ప్రత్యేకవిషయము.

సీతవిషయమున చెప్పిన దంతయు దమయెంతియెడ కూడ వర్తించును. నిరంతరదు:ఖాక్రాంతలగుటచే వారి పతిభక్తి పరమపవిత్ర మయ్యెను. చిరదు:ఖభాజనములు కావుననే వారు మానవహృదయముల బట్టుకొని యుందురు. నిహతులు కాకున్నా వారి వియోగదశ దుర్నిరీక్ష్యమయి చిరసంతాప కారి యగుటచే వారిని చూచి జాలిపడనివా రుండరు. హత్య లేకయే సంతాపమూ శోకమూ స్థాయీభావ మొందు చున్నవి.

హత్యయందు బీభత్స సంచారము

డెస్‌డెమోనా యెడ జాలిపుట్టదా? ఆమెనుచూడ గుండె లవియవా? ఆహా! తప్పక అట్లేజరుగును; కాని ఈ హత్యాకాండమున నుదయించిన అశ్రుధారలకును సీతావియోగమున ప్రభవించిన కన్నీటికాలువలకున్నూ సామ్యమే లేదు. దీనిగూర్చి ప్రత్యేక చర్చ చేదాము.

షేక్స్‌పియరు నాటకాళియందు ఇమోజన్, డెస్‌డెమోనావంటి ప్రేమపూరితలూ పతివ్రతలూ అరుదుగా నున్నారు. డెస్‌డెమోనా ప్రేమ జూలియట్‌ప్రేమవలె హృదయోన్మాది కాక అత్యంత గంభీరము, హృదయపూరితము, శాంతమైనా అది యుగ్రము ప్రబలము నగును - దాని యుద్రేకమున కళ్లు పొరలు కప్పవు; దానిచే నలంకృతయై డెస్‌డెమోనా స్వీయ హృన్మాధుర్యప్రభావమున అందరిమన