పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47 రక్తపాతము

లును ప్రబల మైనసాక్ష్యము నిచ్చును. అమెరికాఖండము నాక్రమించుకొన్నప్పుడు స్పెయినుదేశీయు లెంతనీచముగా ప్రవర్తించిరి? ఇవన్నీ పరిశీలించినచో యూరోపీయజాతుల పరిస్థితులు క్రూరోపకరణములచే సంఘటిత మైనవని స్పష్టమగును. అట్టియెడ కోమలప్రవృత్తులు వారి హృదయములం దుద్భవించు టెట్లు? క్రైస్తవధర్మ మున్నతమైనదే కాని యూరపుఖండమందు అది నిష్ఫల మాయెను, తత్ఖండవాసుల క్రూరత డిందు పరిచి సరళప్రవృత్తుల నాటలేక పోయింది.

'What is bread in the bone cannot come out of the flesh'

"శల్యగతమైన నైజంబు చలితమగునె?"

యూరోపీయ జాతులయందు ప్రకృతిమూలక మైన యీదోషము వారి యితిహాసములనే కాక సాహిత్యమును కూడ కలుషిత మొనర్చింది.

వియోగాంతనాటకములు చదిన ఫలము

క్రూరప్రకృతులు రక్తప్రియులు నగు యూరోపీయులు గ్రీకువారి వియోగాంతనాటకముల నమితాదరముతో అనుమోదించి అనుకరించిరి. వారి ప్రకృతలకూ రుచులకు తగిన వాటిని వా రామోదించుట అబ్బురమా? వీరి మూలమున ఆంగ్లేయ సాహిత్యమున ఆనాటకములు ప్రవేశించెను. అవి వారి కమితానందదాయకములగుట నిస్తుల ప్రతిభావంతుడగు షేక్స్‌పియరు కూడా ఆయానందవార్థి నోలలాడుచు, వాటి