పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15 ఆదర్శము

దలి తమోమయ మలినభావములు సాక్షాత్కరించిన తెరగు ప్రకటించుట కా కావ్యము నాతడు రచియింప సమకట్టెను. అట్టిచో దేవభావముల నాత డేల చిత్రింపబూనును? ప్రబలమగు నాసురప్రవృత్తిని పెంపొనర్చి నైతికశాసన ప్రభావమును దరిజేరనీయని దుర్దమనీచ ప్రవృత్తియగు పాపమయప్రకృతి నామహాకవి చిత్రించెను.

మహాభారతమున గదాధారియగు నాసురప్రకృతి దుర్యోధనరూపమున నంతట తానేయైప్రబలి, తన యా వేగమున మహాత్ములగు ద్రోణకర్ణులను లోభవాగురులలోని కీడ్చి వారి ప్రతాపమంతయు సమరమున సమయజేసి, నైతికశాసనమును గానీ ఉత్తమపరామర్శమును గాని చెంతజేరనీయక - గాంధారి, విదుర, భీష్మ, ధృతరాష్ట్రుల హితబోధనను పూరికైన గొనక - కురుపక్షమున దేవద్రోహముచేయ కంకణముగట్టి, కురుక్షేత్రమందు ధర్మవిరుద్ధముగా ఘోరసంగ్రామము కల్పించి పృథ్వీతలమంతయు నెట్లు గడగడలాడించెనో, అట్టి ఆసుర బలమే మిల్టను తనకావ్యమున సైతానురూపమున చిత్రించెను. ఈరెండును బింబప్రతిబింబము లనజెల్లును.

ఆర్యసాహిత్యమున సృష్టిసంపూర్ణత

పాపపూరితమగు ప్రపంచమును చిత్రించుట ప్రయాస జనకముకాదు. ఎటుజూచినా అదే ప్రత్యక్షము; కనబడు దానిని చిత్రించుట కష్టముకాదు. కావున షేక్స్‌పియర్ ఇట్టి