పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5 ఆదర్శము

దానియందు ధర్మానురాగము నుత్పన్నము జేయకుండునా? ధర్మముదెస ఆహృదయ మించుకేని ప్రసరింపదా? * [1] ఆర్య సాహిత్యాధ్యయన ఫల మెంత సుందరమో, ఎంత ఉత్కృష్టమో, ఎంతశాంతిదాయకమో ఎంతవిశుద్ధమో చూచినారా?

ఆర్యాంగ్లేయ సాహిత్యములు.

ఆంగ్లసాహిత్యమును కాని తదితర ఐరోపీయ సాహిత్యములనుగాని పఠించిన ప్రాప్తించు ఫలమిదేనా? ఆర్యసాహిత్యమునకు శిరోభూషణములై సర్వాంగసౌందర్యమును సమకూర్చి తత్ప్రాణపదములు గౌరవదాయకములూ ధర్మనైతిక సుందరములునగు నున్నతాదర్శములు ఆంగ్లేయ సాహిత్యమున లభించునా? లభింపవు. అందు మానవసంఘాముల యొక్కయు నూనవవ్యక్తులయొక్కయు చిత్రములు లేక పోలేదు, కాని అవి ఆర్యసాహిత్య చిత్రములవలె ధర్మగౌరవ పూర్ణములుకావు. ధర్మగౌరవ మందందు చిత్రింపబడెనేకాని ప్రస్ఫుటితముగాక ప్రచ్ఛన్నముగానున్నది. నిబిడారణ్యమున నేమూలనో కుసుమితమగు మాలతీలత తనసౌరభ్యమును వ్యర్థపరుచు నట్లూ కంటకిత కాననమున సహకారము తన మనోహరతను ప్రకటింపజాలనట్లూ, హింస్రమృగముల భయా

  1. * కేవలము ధర్మము దెసకేగాదు, వర్ణాశ్రమమర్యాదవంక కూడా ప్రసరింపగలదు. సంయములూ ధీరులూ సచ్చరితులూ అగు పురుషులనూ, దయ. వాత్సల్యముమున్నగు మధురభావావేశులగు స్త్రీలనూ అనుసరించుకోర్కె, తప్పక చదువరుల హృదయముల నెలకొనును.