పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176 సాహిత్య మీమాంస

విద్య

మానవప్రకృతిలో స్వాభావికముగా పశ్వంశ ప్రధానమయి యుండును, కావున దానిని పోగొట్టుటే విద్యయొక్క ముఖ్యోద్దేశము. పశుత్వమునకు ప్రాధాన్యము తగ్గించి మనుష్యత్వ దేవత్వములకు ప్రాధాన్యము సిద్ధింపజేసేదే క్రమమైనవిద్య. ఇట్టివిద్య మనసంఘముయొక్కయు, కుటుంబముల యొక్కయు రీతినీతులమూలాన సిద్ధిస్తుంది. స్త్రీజాతిని అడ్డుఆజ్ఞలులేక దానిచిత్తమువచ్చినట్లు పెంపొందనిస్తే అదెంత నింద్యస్థితికి వచ్చునో, క్రమమైన విద్యాప్రభావమువల్ల అది దివ్యత్వము నెట్లుపొందునో మనశాస్త్రములందు వర్ణింపబడి ఉంది. బాల్యమునుండీ సుపరిష్కృతము కాకుంటే మానవప్రకృతియొక్క సౌందర్యము భాసమానము కాదు. అందుకే మనయిళ్లలో బాలులతో పాటు బాలికలకున్నూ చిన్నప్పటినుండీ క్రమశిక్ష ప్రారంభింపబడును. ఈ శాసనప్రణాళి కఠినము - పితృగృహము విడిచి గురుకులము ప్రవేశించేదాకా బాలులకు నయశిక్ష ఒసగినట్లు బాలికలకు కూడా పుట్టినిల్లు వదలి మెట్టినిల్లు చేరేవరకూ నయశిక్ష నొసగుచుండేవారు. సుశీలలగుటకు తరుణావస్థయందే వారి నత్తింటి కంపేవారు - బాలుడు గురుకులమున్నూ బాలిక అత్తిల్లూ ఇంచుమించుగా ఒకయీడునే చేరేవారు, కాబట్టి యిద్దరికీ పిత్రాలయమందు మొదలుపెట్టిన విద్య అన్యగృహమున పెంపొంది సమాప్తమయ్యేది - తరళమతులైన బాలకులను తగినరీతిని శాసించి భావజీవితమున కుపయోగించే