పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174 సాహిత్య మీమాంస

లనే భీష్ముడున్నూ బోధించి తనువు చాలించెను. భగవద్గీత లందు శ్రీకృష్ణు డుపదేశించిన నిష్కామనివృత్తిమార్గమూ విశ్వప్రేమయూ పాండవు లింకాపొందలేదు, నిష్కామభావమున వారు యుద్ధ మొనర్పలేదు, అట్టి యత్నమూ చేయలేదు. అట్టివారు శ్రీరామజనకాదులవలె నిర్లిప్తభావమున రాజ్యము చేయగలరా? క్షత్రియాదర్శమగు ఉన్నత రాజ ధర్మమును వా రనువర్తింపలేదు, విశ్వప్రేమ చూపించనేరని క్షత్రియులు రాజ్యశాసనమున కహున్‌లు కారు. ఇట్టి ప్రేమాన్వితులైన దశరథ శ్రీరామపాత్రములను నిర్మించి వాల్మీకి సింహాసనాసీనుడయిన రాజు ప్రేమరాజ్యమును స్థాపించు తెరగు రామరాజ్యదృష్టాంతమున లోకమునకు వెల్లడిచేసెను. మహారాజాధిరాజైన రాముడు ప్రజానురంజసతత్పరుడై ప్రాణాధిక యగు సీతను పరిత్యజించెను; లోకహితము కూర్ప తనసుఖము బలియొసగెను. అట్టిరాజ్య మెచ్చటనైన తిరిగీ స్థాపించబడునా? అట్టి రాజశేఖరుడు తిరిగీ అవతరించునా?