పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

157 వీరత్వము

వీరత్వమున సమరము రక్తపాతము

బ్రహ్మవీర్యము, క్షాత్రవీర్యము, అసురవీర్యము - ఈ మూడురకాల వీరత్వము ప్రదర్శించుపట్ల ఒకానొకప్పుడు రక్తపాత మావశ్యక మగును. బ్రహ్మవీర్య మార్జించునెడ కొన్ని వేళల ఘోరసంగ్రామ ముపస్థితమై అందు రక్తపాత మావహిల్లును. తపశ్శక్తియందు కర్తవ్యనిష్ఠ, బుద్ధిబలము, విక్రమమున్నూ చూపట్టును. ఇట్టి కర్తవ్యపాలనమున తత్పరుడై శిబిచక్రవర్తి డేగనోటనుండి పావురమును రక్షింప నుద్యమించెను. అతనికర్తవ్యనిష్ఠ ధర్మ తేజ:ప్రాబల్యము నందు గాంచవచ్చును. ఆతని చరితము చదువునప్పు డదిసత్యమా కాదా అను ప్రశ్న పుట్టనే పుట్టదు. అతని త్యాగము, తపస్సు, కర్తవ్యనిష్ఠ, ధర్మపరాయణతయున్నూ మానసముల నలరించ కల్పనాశక్తి ప్రబలమై వివేచనాశక్తిని మరుగుపరుచును. ధర్మ తత్పరత సర్వవ్యాపి యగును. కావ్యకల్పనమున ఇట్టి ఇంద్రజాలప్రభావము ననుభవింపచేయడము పాశ్చాత్యకవులకు చేతకాదు. మానవ చరితమున ధర్మతేజ:ప్రభావ మెంత యున్నతి చెందునో, వీరపటిమ ఎంతవరకూ పెరుగునో ఆ కవు లూహింపలేకపోయిరి. అందుచేతనే షేక్స్‌పియర్‌కి తగిన వీలు చిక్కినా ఇంతటి మహత్తు కల్పించలేకపోయెను. డేగను బోలు షైలాక్ పట్టెడు మాంసఖండమును లోభించునప్పుడు కవి రక్తపాతము కావింపనేరకపోయెను. కారణ మేమన కావ్యప్రారంభమునుండీ కవి ధర్మానురాగము జొన్పనే