పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154 సాహిత్య మీమాంస

టకు సిద్ధపడెను! పదునాల్గేళ్ళు నాతిగల బ్రహ్మచర్యము ననువర్తించి ధర్మైకనిష్ఠుడై బ్రహ్మవీరత్వ పరమావధి నెట్లు చేరెనో యోచించండి! అరిషడ్వర్గము కానీ, రాజభోగములు కానీ ఆతని చిత్తమునకు చాంచల్యము కల్గించెనా? బ్రహ్మచర్యనిష్ఠకు ఉత్కృష్టోదాహరణమైన భీష్ముడు బలవిక్రమ సంపద నద్వితీయుడైన మహావీరుడు. ఆజన్మబ్రహ్మచర్యము ననుష్ఠించిన శ్రీశుకుడు అమానుషసంయమమున కే కోదాహరణము. సనాకాదుల బ్రహ్మచర్యనిష్ఠ క్షత్రియులయందున్నూ కనగలము - హిందువులం దసంఖ్యాకులగు బాలవితంతువులు బ్రహ్మచర్యము సల్పి మహాశ్వేతవలె భగవంతున కాత్మసమర్పణ మొనర్చు చున్నారు. ఇట్టి సంయమమే హిందువుల కబ్బిన మహాశక్తి. శ్రీరాముడు నిజపౌరుషము క్షత్రియ శౌర్యము నెరిగినవాడు కావుననే సీతతోగూడ వనవాసము చేయ సిద్ధపడెను. బ్రహ్మచర్యానుష్ఠానమున కావశ్యకమగు ధైర్యము, ఇంద్రియనిగ్రహము, సహిష్ణుత, సీతను రక్షించుకొన గలనను నమ్మకమూ కలవాడు కావుననే దండ కాటవికి ప్రయాణించినాడు. వనవాసమువల్ల అభ్యంతరికబలమూ క్షాత్రవీర్యమూ ప్రకటితము లాయెను.

శ్రీరామునియందు బ్రహ్మక్షత్రవీరత్వములు రెండూ ప్రాధాన్యము చెందెను. అరిషడ్వర్గము నదిమి అంతరింద్రియములను వశపరచుకోవడముచేత బ్రహ్మవీర్యమూ, బాహ్య శత్రువుల నదిమి బాహ్యేంద్రియముల వశపరచుకోవడమువల్ల