పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150 సాహిత్య మీమాంస

మెక్కువాయెను. అట్టివారే వీరులని ఆ ఖండవాసుల అభిప్రాయము. జనుల కల్పనాప్రపంచమున నెట్టివాళ్ళు కుదుట పడతారో వారికే సాహిత్యమున చోటు దొరుకును. దానిని పఠించువారు ఆ వీరుల చూచి రోతపడక పైపెచ్చు వారినే ప్రశంసింతురు. లోభాంధవశత మేక్‌బెత్ రాణి వీరవనిత యైనది. కామద్వేషములు కన్నుగప్ప ఒథెలో యున్నూ, కౌశలవ్యూహమును పన్ని ఇయాగోయున్నూ వీరులైరి. వియోగాంతనాటకములయందలి వీరు లందరూ ఇట్టివారే!

ఈనాటకములయందు ప్రతిష్ఠింపబడిన వీర్యమే ఇతిహాసములయందెల్ల గౌరవింపబడుతూన్నది. కామపిపాసాపీడితులై, సర్వగ్రాసియైన లోభలాలసకు లొంగి అహంకారమదమున పృథ్వియెల్ల తుచ్ఛమని భావించి, అత్యాశాపరతంత్రత రణావేశులై, విజయోల్లాసమున దానవుల విడంబించి దేశమందెల్ల రక్తస్రోతముల ప్రవహింపజేసి నిజప్రభుత్వమును స్థాపించినవీరులే విఖ్యాతయశులై సర్వజనాదరణీయులయినారు. సికందర్, సీజర్, నెపోలియన్, హానిబాల్ ప్రముఖు లిట్టివీరులే; వీరే వియోంగాతనాటకముల నాయకులకు మేలుబంతులు. వీరందరూ పృథ్వీమండలమున రక్తవాహినుల ప్రవహింపజేసిన వారే. ఆర్యసాహిత్యమందుకూడా అసురు లప్పుడప్పుడు ప్రాదుర్భవించి క్రామక్రోధాదులకు వశులై పృథ్వీపై రక్తవృష్టుల గురిపించిన ట్లున్నది. వియోగాంతములయందలి వీరులకును ఆర్యసాహిత్యమందలి అసురులకున్నూ కొంచెమైనా