పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136 సాహిత్య మీమాంస

కుటుంబసీమను దాటిపోదు, పతికర్తవ్యమో, ప్రపంచమంతటా ప్రాకును. ఇట్టి కర్తవ్యతాజ్ఞానమును మదిని నిల్పి భార్యాసక్తిని తనవశమం దుంచుకోవడ మత్యావశ్యకము. ఇట్లు చేయుటకు శక్తి లేకపోవుటచేతనే మేఘదూత యందలి యక్షునకు కుబేరుడు దేశాంతరవాసశిక్ష విధించెను. యక్షుని అగాధపత్నీప్రేమ అజరామరమగు కాళిదాసు లేఖినిచే కావ్యరూపమున చిత్రింపబడినది. ఇంకొక దిక్కున చూడండి - శ్రీరామచంద్రుడు ప్రజానురాగమునకు వశవర్తియై సీతను వనముల కంపెనుకదా, భార్యపై ఆతనికి ప్రేమ లేదనుకోవచ్చునా?... ఆర్యసాహిత్యమున గాఢమైన పతిప్రేమకు పతిభక్తి అనిపేరు; అగాధమగు పత్నీప్రేమ పత్నీభక్తి కాదు, స్త్రైణత అనబడును, ఇదే స్త్రీలోలత్వము. హిందూ సంఘమున నియమరక్షణార్థ మేర్పరుపబడిన వ్యవస్థల పాటించుటే మనుష్యత్వ మనబడును.

స్వాధీనత - స్వేచ్ఛావృత్తి

హిందూసంఘ నిర్మాణమునుబట్టి మానవప్రకృతి యందలి పశుభావము వికాసము చెందనేరదని మనమూహింప వచ్చును. దేశాచారములన్నీ మనుష్యత్వము దేవత్వమూ పోషించుట కనుకూలించును గనుక వాటియధీనమున నుండుటే మానుషత్వ దేవత్వముల అధీనమున నుండుట. స్త్రీపురుషులు మానుషత్వసీమను దాటకుండునట్లు వారిని నియమబంధములలో నిల్పి యుంచడమే సంఘనీతికౌశలము