పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

133 మానవప్రేమ

ఆర్యసాహిత్యమున సుధానిధివలె కావ్యరసము వెల్గుచున్నది, కావున అట్టి కళంక మొక వ్యాఘాతము కాదు. చంద్రుడే లేనిచోట కళంకము కళంకమువలె నుండిపోవును.

ఆర్యవాఙ్మయమున శృంగారరసము పెక్కుచోట్ల వర్ణింపబడినది. మనకవులు రసస్వభావము చక్కగా నెరిగిన వారౌటవల్ల ఏరసముచే హృదయము కరిగింపవలెనో కావ్య సమాప్తి యగుసరికి ఏరసము స్థాయీభావము చెందవలయునో, నిపుణతతో గుర్తించి కావ్యముల రచింతురు. అందుచేత కొన్నిటియందు వీరరసము, కొన్నిటియందు కరుణ, మరికొన్నిటియందు మరికొన్ని రసములున్నూ ప్రాధాన్యము చెందినవి. వీటిలో ఒకటిగాని రెండుగాని ప్రధానముగా నెంచి వాటికి తోడు మరికొన్ని రసములు కూర్చి, అంతర్విరోధము ఘటిల్లకుండునట్లు రచనచేస్తే కావ్యము భిన్నరసాలంకృత మయి, అది పరిసమాప్తి యగుసరికి చిల్లరరసములన్నీ మాటుపడి స్థాయీభావము నొందిన ప్రధానరసమే నిలిచియుండును. అందుకే "వాక్యం రసాత్మకం కావ్యమ్" అని ఆలంకారికులు నిర్వచనము చేసిరి.

స్త్రైణ శాసనము

హిందూకుటుంబములయందు దంపతీప్రేమ వ్యవస్థానుసార మెట్లు పెరుగునో దిఙ్మాత్రముగ వివరించితిమి. పతియెడ పత్ని కనురాగము ఏకనిష్ఠమై అతిశయించినకొద్దీ పతికికూడా