పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114 సాహిత్య మీమాంస

కాతరత, ప్రౌఢభావములూ మానవసంఘమునకు వెలియైన మానినిమానసమున నెట్లుదయించగలవో తెలియదు; అట్టి చాతుర్య మామెకు శోభాదాయకమూ కాదు. యువజన సులభములగు హృదయావేగము ఇంద్రియాలాలసయు, ఆ సల్లాపమున ప్రకటితము లైనవి. మిరాండాఫెర్డినెండుల కిద్దరికీ వివాహోత్సుకత సమానమే, కాని అతనికన్న ముందు ఆమె తనకోర్కె వెలిపుచ్చినది. ఈ విషయమున శూర్పణఖకూ ఆమెకూ భేదమేమి? ఆంగ్లకవిసార్వభౌముని రచన యందు యౌవనోన్మాదమునకు ఉత్సుకతకున్నూ మిరాండా పాత్రము ఉత్తమోదాహరణము.

కవిరచితమైన ఆదర్శ సృష్టి

కామక్రోధలోభ మోహహింసాద్వేష ప్రభృతులగు ఆసురిక పాశవ ప్రకృతుల అలౌకికచిత్రములను షేక్స్‌పియరు రచించినట్లే, ప్రేమదయాదాక్షిణ్యక్షమా ప్రభృతులగు ధర్మ ప్రవృత్తుల ఉత్కర్షను ఆర్యకవులు రచించిరి. ప్రపంచమున నిట్టి ఉదాహరణములు అరుదుగా లభించును. మేక్‌బెత్ రాణివలెనే సీతాసావిత్రిలూ దృశ్యప్రపంచమున దుర్లభ వ్యక్తులు, కావ్యప్రపంచముననే వారిని గాంచవచ్చును. కల్పనా రాజ్యమున ఆదర్శసృష్టిచేసి మానవోత్కర్షను కవి చూపును. ఇట్టి సృష్టిచేయుటే కావ్యరచనకు ముఖ్యోద్దేశము. అనుదినమూ చూస్తూన్న విషయములను చిత్రించుటకు కవి సృష్టి కావలయునా? ముంజేతికంకణమ్మున కద్దమేల? కనబడే