పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

103 పాశవప్రేమ

ములు కానవచ్చును, - రావణునిబోలు మత్తమాతంగములు, స్వర్ణప్రసువగు లంకాద్వీపము, ఇంద్రభోగమును, మానసముల నాకర్షింప, వాటి మహత్వప్రకాశమున కన్నులు మూతపడును. క్లియొపేట్రారూపము జగన్మోహనము, మేక్ బెత్ రాణిని దలచినతోడనే లోభప్రబోధమగును; ఇయాగోచాతురి మానసమును మ్రాన్వడజేయును; ఇట్టిపాత్రములు చిత్తమున జొత్తిల్లి తత్ప్రతిబింబములం దచ్చుపడిన వెన్క సంయోగాంతములందలి పాత్రములకు సందేది? సర్వసామాన్యములగుటచే వాటియందు తారతమ్యము కన్పట్టదు. షేక్స్‌పియరు కల్పనాప్రపంచమున ఈ రెండువిధముల పాత్రములే కనబడును. - అదంతయు షడ్రిపుసంక్షుభితమగు మానవప్రకృతి. విషయాభిభూతములగు పాత్రములయం దాసక్తులగు వారి చిత్తములకు తద్విరుద్ధ స్వభావపాత్రములు రుచించునా? పాత్రగణనాప్రసంగమున వియోగాంతముల నాయికానాయకులు అగ్రస్థానము నలంకరింతురు, వారివెన్క వియోగ సంయోగాంత (Tragi - Comedy)ముల పాత్రములు, ఆవెన్క సంయోగాంతపాత్రములును మెప్పు వడయుచుండును.

అంతశ్శత్రుప్రాబల్యము, ఇంద్రియ లాలసాప్రాధాన్యము అంతటా వెలయుచున్నా, కొన్నిచోటుల నది తగ్గును. రోమియోజూలియటుల బోలు సాంఘాతికరిపూచ్ఛ్వాసము సంయోగాంతములం దుండక తద్బలము క్షీణించియున్నా యౌవనోన్మాదము, అధీరత, లాలసా వేగమున్నూ ఉండి