పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94 సాహిత్య మీమాంస

నీచోచ్చముల గణించక నీచ ముచ్చమును, ఉచ్చము నీచమును చేయుసామర్థ్యము దానికి కలదు. చిన్నదానిని పెద్దజేయునప్పుడు పెద్దదానిని చిన్నబుచ్చునప్పుడును కామమునకు సంచారీభావము సమకూరును.

ప్రేమకూ కామానురాగమునకూ ఇంకొక తేడా ఉంది. ప్రేమ తనప్రభావముచేత మానవునకు దేవత్వ మాపాదింప, కామానురాగ మాతనియందు పశుత్వమును సంక్రమింపజేయును. ప్రేమ భగవదవతారము కావున ఈదేవాంశమును మానవు డెంత అభివృద్ధినొందిస్తే భగవత్సాన్నిధ్యము నంతవేగముగా చెందగలడు. పిమ్మట సాయుజ్యము సులభ మగును. అట్లుచేయక కామపరతంత్రుడై కాలముపుచ్చు చుండునా, తనప్రకృతిని పశుభావమున పరిణతము చేయుచూ మోక్షమునకు దూరుడగును.

ఆర్యసాహిత్యమున కామము

ఆర్యసాహిత్యమున సతీప్రేమాదర్శము, కామానురాగ స్వభావము నెట్లు చిత్రింపబడెనో సూచించితిమి. ఇంద్రియ లాలసాచిత్రములూ వాటిరీతులూ కూడ ఆ సాహిత్యమున వివరింపబడినవి. పశుత్వకలితములగు పాపరూపములూ కన్నులకుకట్టినట్లు చిత్రింపబడినవి, అందలి మంచిచెడ్డలు మరుగుపడలేదు. ముక్కోటిదేవతల కధీనాథుడగు ఇంద్రుడూ శపింపబడెను, ఆతనిపై మరులుగొన్న అహల్యయూ పాపఫల మనుభవించెను. తారాశశాంకుల పాశవకృత్యమునకు తగినశాస్తి