పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86 సాహిత్య మీమాంస

దుండజాలదు, అందుచే "ధర్మపత్ను" లను ఆర్యపదము వారియందు చెల్లదు. ధర్మపత్నుల కుచితమగు సతీచరిత్రము పాశ్చాత్యసాహిత్యమున లభింపదనుట నిర్వివాదాంశము. సహధర్మిణీచిత్రమును సావకాశముగా నెఱుంగవలెనన్న ఆర్యసాహిత్యమునే పఠించవలయును. ఆర్యసతి కోరేది యీజన్మమునమాత్రమే పత్యనుసరణము జేసి అతనితో సాయుజ్య మొందవలెనని కాదు; ఇహమున పరమునా పత్యనుసరణమే పరమధర్మమని యెంచి సచ్ఛీలబలమునా ధర్మాచరణ ప్రభావముననూ పతితోగూడ దేవత్వము అమరత్వము నొందడమే ఆమెకు పరమావధి. అందుచేతనే ఆమె "అర్ధాంగి" యగుచున్నది.

పతిప్రేమనుండి విశ్వపతి ప్రేమ

ఆత్మోత్సర్గముతో సతి అభ్యసించు పతిభక్తియే భగవద్భక్తికి మొదటి మెట్టు. ఈరీతిని భక్తుడు భగవంతుని యందు లీనముగాకున్న భగవద్భక్తి అతని కలవడనట్టే. పతిభక్తిచే సతి పతియందు లీనమగునట్లు భక్తుడు భగవంతుని యందు లీనుడై తచ్చరణములకు తన స్వాస్థ్యమును సమర్పింపవలెను. దీని నంతయు పరికించి చూస్తే సతియొక్క పతిభక్తి భక్తుని దైవభక్తికి నకలని తోచును. పతినే భగవంతునిగా భావించి వానిలో లీనమగుటకు నెంచుటచే సతి దేవ్యవతారమగుచున్నది. సీతయు రాధయు ఈరెండుతెరగుల ప్రేమాదర్శములై పరస్పరప్రతిబింబము లవుచున్నారు.