పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84 సాహిత్య మీమాంస

తువులవలె స్వాతంత్ర్యమూ, స్వేచ్ఛాచరణమూ తత్పూర్వ ముండెననియు, అట్టి యాచారముల నుజ్జగించి భారతీయులు ఉన్నతప్రపత్తి ననుసరించి దివ్యత్వమును సాధించిరనియు అతడే చెప్పెను.

మనము అట్టి దేవత్వమును కోలువోయి నీమ్న వ్యాపారముల ననుమోదించుట ధర్మమా? యుక్తకర్మమా?

ఆర్య సతి పవిత్రత

యూరోపీయ సాహిత్యమున మానవప్రకృతియందలి నైసర్గిక స్వేచ్ఛాచరణమునకు ప్రాబల్యము కానవచ్చుచున్నది. ఆర్యసాహిత్యమున ప్రేమ ఉదయింది మానవప్రకృతిని పవిత్రిత మొనర్చి దాని కున్నతి చేకూర్చింది. మహాశ్వేత*[1]ప్రేమ ఇట్లే పవిత్రితమై దైవారాధానముగ పరిణమించెను. ఆమె మూర్తీభవించిన దైవారాధన, ప్రకృతిరూపముగొన్న పవిత్ర ప్రేమ అననొప్పు. అచ్ఛోదసరస్తీరకాననాభ్యంతరమున దైవారాధన చేయుచుండు ఆసతీమణీ దేవీమూర్తియో మానవీమూర్తియో నిర్ణయించుట కష్టము. దేవపూజా చ్ఛలమున మానసమునకు ఏకాగ్రత కల్పించి ఆమె యెవ్వని పూజించుచున్నది? అప్పుడామె పతిని ప్రేమించుచున్న దందామా? లేక పూజించుచున్న దందామా? బాణభట్ట నిర్మితయగు మహాశ్వేతవలెనే కాళిదాస నిర్మితయగు

  1. * బాణకవి రచితమైన కాదంబరి అను గద్యకావ్యమున నొక నాయకి.