పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81 దివ్యప్రేమ

వచ్చును. పతిగతించిన పిదపనే కాక పతిజీవించియున్నా ఆతని త్యజించి (Divorce) వేరొకని పెండ్లియాడు ఆచారము కూడా వారిలో కద్దు.

ఆర్యస్త్రీలు తమ పెద్దలు నిర్ణయించిన వానిని పతిగా వరించి, యావజ్జీవము ఆతనినే దైవముగా నారాధిస్తూ, తదేకనిష్ఠతో అతని యిచ్ఛానుసారము వర్తింపవలెను. ఈ యాచారము పాశ్చాత్యస్త్రీలకు నిర్బంధముకాదు. పతిజీవిత కాలములో వేరొకని పెండ్లియాడుట కలలోనైన ఆర్యస్త్రీ తలపగూడదు.

ఇందువలన ఆర్యసతీత్వాదర్శమునకూ పాశ్చాత్యాదర్శమునకూ సామ్యమేలేదు; సరేకదా మీదు మిక్కిలి వైషమ్యము కూడా కద్దు. రెండూ పరస్పర విరుద్ధ ధర్మములు.

సాహిత్యమున పాతివ్రత్యము -

మన పూర్వులు మనుష్యోచిత వ్యవహారమును సంస్థాపిత మొనర్చి, దానికన్న ఇంచుక భిన్నమగు సతీత్వాదర్శమును నిర్మించి, సాహిత్యమున నెల్ల కడల ఉపపాదించిరి. యూరోపీయ సతీత్వమున లోకవ్యవహారోచితపథము కన్న విశేష మేమియు లేకుండుటచే తదాదర్శవర్ణనము ఆసాహిత్యమున కానరాదు. ఎచ్చట చూచినా ఆర్యాదర్శము వంటి ఉత్కృష్టాదర్శవర్ణన మాసాహిత్యమున లేకుండుటచే దానిని పదేపదే చదివే మన స్త్రీలకు మన సతీత్వాదర్శము అసంభావ్యమని తోచి దానియందు గౌరవాదరములు కలుగనేరవు.