పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48 సాహిత్య మీమాంస

యందలి ఆదరమహిమచే దోషమును పెకలింపజాలక తన రచనాచాతురి నందే ఓతప్రోతము కావించెను. అతని వియోగాంతనాటకములు జనవశీకరణ సామర్థ్యమును సంపాదించి ప్రపంచమున అనుపమగ్రంథము లని కొనియాడబడు చున్నవి. అందరూ ఆమహామహుని ప్రతిభాప్రసూతనాటక రాజము లనే బంగారుకత్తితో గొంతుక కోసుకొన నుద్యమించిరి. ఇప్పటికీ మనలో ననేకులు షేక్స్‌పియరువంటి కవిసార్వభౌముడు వాటిని రచియించె ననుభక్త్యావేశమున తత్పయోముఖవిష కుంభములయందలి అమృతమును మనసార గ్రోలుచున్నారు. సాహిత్యము సర్వగుణసంపన్నముగనూ, తతశోభాయుతముగనూ, అనంతమాధుర్యకలితముగనూ, కావించిన కాళిదాసు కావ్యములు మనవారి కిప్పుడు రుచించుట లేదు, భవభూతి రచించిన అనఘన్ మగు ఉత్తరరామచరితము ఎక్కడో పాతర వడినది, వ్యాసవాల్మీకిరచితము లగు మహాకావ్యములకు వ్యాప్తియే లేదు. ఆంగ్లవిద్య నభ్యసించువారి కాంగ్లకవిత రుచించుట ఆశ్చర్యమా! షేక్స్‌పియరు నాటకసమాలోచకులే (Critics) మనకు పథప్రదర్శకు లగుచున్నారు. మన రుచులు వారిపాల బడినవి. విస్సన్న చెప్పినదే వేదము. వారి రుచులే సభ్యములు, వారి అభిప్రాయములే ప్రశంసనీయములు, వారి ఆదర్శములే మన కాదరణీయము లగుటచేత మన జాతీయసుకుమారరుచులు జర్జరితములై అత్యుత్కృష్టాదర్శము లడుగంటు చున్నవి, వాటియందు మనకు గౌరవము క్రమ