పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44. సాహిత్య మీమాంస

కముగా పరిణమించును. అందువలన లోకము మాలిన్యకలితమగును. కావున ఆర్య నాటక కర్తలు హత్యలు విసర్జించిరి. యూరపు దేశమందలి వియోగాంత నాటకము*[1]లవంటినాటకములు సంస్కృతమున లేవు. హిందూధర్మాదర్శములకు విపరీతము లగుటచే అవి మన సాహిత్యాదర్శములకు ప్రతికూలములు. అట్టివి మనదేశమున పుట్టుకుండుటవల్ల వాటియనర్థములు మనల దాపరించలేదు.

యూరోపీయ వియోగాంతనాటకములఉత్పత్తి, వాటి ప్రకృతి

మనసంస్కృతనాటకసాహిత్యమందలి ఉచ్చాదర్శము లన్నియూ మన ధర్మానుసారము అనుమోదనీయములు. అవి మనహృద్భావములతోడను సురుచులతోడనూ చక్కగా మేళవించును. యూరోపీయ సాహిత్యమున నిట్టివి మృగ్యములు. సాహిత్యదర్పణమున నుదహరించిన నిషిద్ధకార్యమాలను బట్టి మననాటకాదర్శము స్పష్టము కాగలదు.

యూరపుఖండమున ప్రప్రథమమున గ్రీసుదేశమందు

  1. * ఇట వియోగాంతశబ్దము Tragedy అనుశబ్దమునకు పర్యాయపదముగా వాడబడినది, కాని రెండునొకటికావు. వియోగము అనేక విధముల ఘటిల్ల వచ్చును, Tragedy వాటిలోనొక భంగి. ఉత్తరరామచరితము వియోగాంతమే కాని Tragedy కాదు Tragedy యందలి వియోగము కొట్లాట రక్తపాతము లేక కాబోదు. ఇవిలేకపోయినా నాటకము వియోగాంతము కావచ్చును కదా; అయినను ఈరెండుశబ్దములు సమానార్థమున వ్యవహరింపబడు చుండుటచేత ఈగ్రంథమునకూడ అవిపర్యాయపదములు గానే వాడబడినవి.