పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14 సాహిత్యమీమాంస

ఇట్టి యాసురికాదర్శ మొక షేక్స్‌పియరు నాటకములందేకాక ఆంగ్లశ్రవ్యకావ్యములకు తలమానికంబన జెల్లు Paradise Lost అను గ్రంథమున మహాకవి మిల్టన్ రచనయందుకూడ రాజిల్లుచున్నది. ఈగ్రంథమున కొంత భాగమేని చదువని ఆంగ్లభాషాభ్యాసకు లుండరు. అట్టివా *[1] రాగ్రంథమును చదివినపిమ్మట సైతాను (satan) ఆసురిక భీమప్రకృతి వారిహృదయములం దచ్చుపడినట్లు ఇంకొక చిత్రము నాటుకొనజాలదు. ఆకావ్యమున కాతడు నాయకునివలె సర్వశక్తుడై అన్ని కార్యములూ నిర్వహించుచుండును. స్వర్గమర్త్యపాతాళము లాతని కర్మక్షేత్రములు. అతనిబలము కౌశలమును అపరిమేయములై పరమేశ్వరుని సృష్టియందు ఘోరవిప్లవమును జనింపజేసెను. సర్వజ్ఞుడు సర్వశక్తుడని పేరు వడసిన సర్వేశ్వరు డేమూల దాగియున్నాడో ఎఱుగజాలము. సైతానుని ప్రచండవిక్రమము, ఆసురశక్తి, భీషణదేవద్వేషమును కావ్యమందెల్ల ప్రాదుర్భవించును. దేవద్రోహి యగు సైతాను చేతి కీలుబొమ్మలయి, అతని ప్రలోభనమున బడి ఆదము అవ్వయు పాపానురక్తులై తత్ ఫలమె ట్లనుభవించిరో, పాపపరిణామ మెంత విషాక్తమో చూపుట కేమిల్ట నీరచనకు గడంగెనందురు. ఆకవివరుని మానసమున మానవప్రకృతియం

  1. * ఈమహాకావ్య మత్యద్భుతము, అమితరోచకము; కథ విచిత్రము; ధర్మవ్రతులగు ఆదము అవ్వయూ (Adam-Eve) అందు ప్రధానపాత్రములు; సృష్ట్యాదియందలి మానవవ్యక్తులందు వర్ణింపబడిన వందురు.