పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 సాహిత్యమీమాంస

భగవంతు నాశ్రయించు వారికి జయము తప్పదని ఇందలి సారాంశము. ఇది మాటవరుస కన్నదికాదు, ఇందలి యాథార్థ్యమందరికీ తెలుసును. భారతయుద్ధమున ధర్మపక్షము అనగా భగవదాశ్రితులపక్షమే ప్రబలెను. భారతమున కౌరవపక్షరూపమున మానవులపాపచిత్రము అతివిశదముగా ప్రకటింపబడెను. సాక్షాద్భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణు నాశ్రయించి ధర్మానుసారము ప్రవర్తించిన పాండవపక్ష మంతకన్న నెక్కువగా విశదీకరింపబడినది. ఈచిత్రమందలి సమజ్వలప్రభముందు ఆచిత్రమందలి పాపాంధకారము పటాపంచమగును. వెలుగు ముందర చీకటివెలయగలదా? అందుకే ధర్మక్షేత్రమగు కురుక్షేత్రమున పాపము భస్మీకృత మాయెను.

వాల్మీకి రచించిన మహాకావ్యము శ్రీమద్రామాయణము భక్తిరసపూరిత మహాసముద్రము. అందున్నూ ధర్మమునకే జయము ప్రాప్తించి తద్విజయపతాకము అయోధ్య మొదలు లంకవరకూ ఎగురుచుండెను.

రాక్షసకులము ప్రబలమే కాని భగవద్భక్తిస్రోతమందలి తరళతరంగములలో లీనమయి, శ్రీరాముపక్ష మందలి పుణ్యవంతమగు రాజ్యము అయోధ్యనుండి లంకాపురమువరకు ప్రతిష్ఠితమయ్యెను. రామునిరాజ్య పాలనమున హిమాలయము నుండి కన్యాకుమారివరకును లంకాద్వీప మందున్నూ పుణ్యము స్థాపింపబడెను. దండకారణ్యమున రాక్షసభయము రూపు మాపెను, ఏమూలనో తపము జేయుచున్న శూద్రుడును