పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంటే, జ్ఞానబోధకన్న ఆనందోత్పాదనమే సాహిత్యగ్రంథములకు విశిష్టధర్మముగా గణింపబడుతూన్నది. సత్యమే భావరూపమున హృదయమున ప్రస్ఫుట మవును, సత్యము, శివము, సుందరమూ ఐనదానిని అంత:కరణమున మానవుఁ డనుభవించును. జ్ఞాన మానందానుభవోపాయములు జూపగా భావములే దాని ననుభవించును. మనకు లోకోత్తర జ్ఞానప్రాప్తికి సాధనములు భావములే కాని జ్ఞానము కానేరదు. "ఆనందమే జ్ఞానమందలి సారమ"ని వేదవాక్యము. ఆనందమయకోశము విజ్ఞానమయకోశములోపల ఉండును. అట్టి యానందమునకు మూలకారణము భావము. భావవ్యంజకములగుటచేతనే మనకావ్యముల కగ్రస్థానము దొరికింది. దర్శనములూ, శాస్త్రములూ, ఇతిహాసములూ, కావ్యములకువెనుక బడవలసినవే. శ్రేష్ఠభావములే మనసూక్ష్మ శరీరములను పోషింపఁగలవు. భావముల మూలాన జ్ఞాన ముత్పన్నమగును, వాటిమూలానే జ్ఞానము పరిణత మవుతుంది. భావప్రాప్తికి భావన ఆవశ్యకము; చూడండి.

                       "యాదృశీ భావనాయస్య సిద్ధి ర్భవతి తాదృశీ"

                       "ఎవరి కెరీతి భావన లెసగుచుండు
                        వారి కారీతి తగుసిద్ధి వఱలుచుండు"

శ్రేష్ఠ భావములే మనల వెన్నంటియుండి శ్రేయోదాయకము లవును. సుందరభావము లెందు సంగ్రహింపఁబడునో అట్టివే కావ్యములు, అవే మనకు సాహిత్య మగును. ఆభావములే మనకు హితకరములు. సుకవుల గ్రంథములు సద్భావ